Red Meat: రెడ్ మీట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డేంజర్ లో పడ్డట్టే!
రెడ్ మీట్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:30 PM, Mon - 11 November 24

ఏదైనా కూడా అతిగా తింటే సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. మాంసాహారమైన, శాఖాహారమైన కానీ మితంగా అంటే పరిమితంగానే తీసుకోవాలని లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.రుచి బాగుంది కదా అని ఎక్కువగా తింటే దాని తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నాన్ వెజ్ ప్రియులు కనీసం వారానికి నాలుగు సార్లు అయినా నాన్ వెజ్ ని తింటూ ఉంటారు. అంతకంటే ఎక్కువ సార్లు తినే వారు కూడా ఉన్నారు. కానీ మాంసాహారం ఎక్కువగా తినడం మంచి మంచిది కాదని చెబుతున్నారు.
అలాంటి ఆహారాల్లో రెడ్ మీట్ కూడా ఒకటి. గొర్రెలు, జింకలు, పంది, మేక వంటి కొన్ని జంతువుల నుండి రెడ్ మీట్ లభిస్తుంది. ఎర్ర మాంసం తీసుకోవడం ఎముకలకు, శరీరానికి మంచిది కాదు. కాబట్టి దీన్ని తక్కువగా తీసుకోవాలి. బదులుగా, బఠానీలు, ఫావా బీన్స్ వంటి చిక్కుళ్ళు తినడం మంచిదని చెబుతున్నారు. రెడ్ మీట్ , ప్యాక్ చేసిన మాంసాలలో అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకలు , శరీరంపై చెడు ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ జరగదు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. అలాగే గుండెపోటుకు దారితీస్తుందట. మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు నిల్వ ఉంటుంది.
ఇది బరువు పెరగడంతోపాటు అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందట. రెడ్ మీట్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందట. క్రొవ్వు ఎక్కువగా ఉండే రెడ్ మీట్ కూడా జీర్ణ సమస్యలను కలిగిస్తుందట. జీర్ణక్రియ సమస్యల వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అదేవిధంగా రెడ్ మీట్,ప్యాక్ చేసిన మాంసాన్ని తక్కువగా తినాలట. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందట. బదులుగా, మీరు ప్రొటీన్లు అధికంగా ఉండే బఠానీలు , ఫావా బీన్స్ తినవచ్చట. రెండు సమూహాల మధ్య కాల్షియం లేదా విటమిన్ డి తీసుకోవడంలో తేడా లేదట. వాతావరణం ప్రభావం మానవ ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపుతుందట.