Dates: ఖర్జూరాన్నీ ఇలా తింటే చాలు ఈజీగా బరువు పెరగాల్సిందే!
బరువు పెరగాలి అనుకున్న వారు ఖర్జురాలను ఆ విధంగా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Wed - 31 July 24

ఈ రోజుల్లో బరువు తగ్గాలి అనుకున్న వారు ఎంతమంది ఉన్నారో బరువు పెరగాలి అనుకున్న వారు కూడా అంతేమంది ఉన్నారు. కొందరు అధిక బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం బక్క పల్చగా చాలా సన్నగా ఉంటారు. అలాంటి వారు బరువు పెరగడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా బక్క పల్చగా ఉన్నారా. లావు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు ఈజీగా బరువు పెరగవచ్చు అంటున్నారు వైద్యులు. బరువు పెరగాలి అనుకున్న వారు ఖర్జూరాలు తినాలి అంటున్నారు వైద్యులు.
మరి ఎలా తీసుకుంటే బరువు పెరుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఖర్జూరం తింటే వేడి చేస్తుందని చెబుతుంటారు. కానీ అది నిజం కాదట. ఖర్జూరాలను తింటే పిత్త సంబంధిత సమస్యలు తగ్గుతాయట. నెమ్మదిగా జీర్ణమవుతాయట. వీటిని తీసుకోవడం వల్ల వాత, పిత్త దోషాలను తగ్గించి శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ఖర్జూరాల్లో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్స్, మెగ్నీషియంలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి విటమిన్ సి, విటమిన్ డి లాంటి పోషకాలను కూడా అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా ఖర్జూరాలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం దూరమవుతుందట.
అలాగే బ్రెయిన్ హెల్త్ కి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట. నీరసాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎముకలు బలంగా మారతాయట. అలాగే రక్తపోటు తగ్గుతుందని, పురుషుల్లో స్త్రీలలో లైంగిక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. హెల్తిగా బరువు పెరుగుతారట. ప్రెగ్నెన్సీ స్త్రీలు ఖర్జూరాలు నానబెట్టుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. పైన చెప్పిన ప్రయోజనాలు కలగాలి అంటే ఖర్జూర నానబెట్టుకుని తినాలని చెబుతున్నారు. అయితే ఎప్పుడు తినాలి అన్న విషయానికి వస్తే.. బరువు పెరగడానికి ఖర్జూరాలని నెయ్యితో కలిపి తినాలట. అది కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలట.
అలాగే రాత్రి పడుకునే ముందు కూడా తినవచ్చని చెబుతున్నారు. సాధారణంగా రోజుకి 2 ఖర్జూరాలు తినవచ్చు. బరువు పెరగాలనుకునే వారు రోజుకి 4 తినాలని చెబుతున్నారు. ఖర్జూరాలని నీటిలో నానబెడితే టానిన్, ఫైటిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. ఖర్జూరాలని నానబెడితే త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి, వాటిని నానబెట్టి తింటే రుచి కూడా పెరుగుతుందట. వాటిలోని పోషకాలు పూర్తిగా అందాలంటే కనీసం 8 గంటలు నానబెట్టాలని వైద్యులు చెబుతున్నారు.