Hiccups: వెక్కిళ్లు ఆగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసా?
కొన్నిసార్లు ఆగకుండా వెక్కిళ్లు వచ్చినప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ ని ఫాలో అయితే చాలు వెంటనే ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.
- By Anshu Published Date - 03:30 PM, Thu - 8 August 24

మామూలుగా మనం భోజనం చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్న సందర్భంలో కూడా వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. ఇలా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా అవి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలా వెక్కిళ్లు ఎక్కువగా వచ్చినా కూడా అది అంత మంచిది కాదు అని చెప్పాలి. కొంతమంది నీళ్లు తాగడం లేదంటే అల్లం రసం మింగడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. ఇంకొందరు టాబ్లెట్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వెక్కిళ్లు పదేపదే వస్తూ విసిగిస్తుంటే అలాంటప్పుడు కొన్ని రకాల హోమ్ రెమినేషన్ ఫాలో అయితే చాలు ఈజీగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వెక్కిళ్లు రావడానికి ఎఅనేక న్నో కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఇవి రెండు మూడు నిమిషాల్లోనే ఆగిపోతుంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎక్కిళ్లు చాలా సేపటివరకు అలాగే వస్తూనే ఉంటాయి. కానీ నలుగురిలో ఎక్కిళ్లు వస్తే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎక్కిళ్లను ఆపడానికి నీళ్లను తాగుతుంటారు. అయినా కూడా ఎక్కిళ్లు తగ్గవు. అప్పుడు పెరుగు ఉప్పు కలిపి తినడం వల్ల వెక్కిళ్లు ఫాస్ట్ గా తగ్గుతాయి. ఈ చిట్కా ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే వెక్కిళ్లను ఆపడానికి మీ శ్వాసను కొన్ని సెకన్ల పాటు పట్టుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. కానీ శ్వాసను చాలా సేపటి వరకు పట్టి ఉంచకూడదు.
అదేవిధంగా వెక్కిళ్లు తగ్గిపోవడానికి నాలుకను బయటకు పెట్టి మీ వేలితో నాలుక చివరను పట్టుకొని వదలాలి. ఇలా తరచూ చేయడం వల్ల వెక్కిళ్లు త్వరగా ఆగిపోతాయని చెబుతున్నారు. అలాగే చాలా మందికి తినేటప్పుడు కూడా ఎక్కిళ్లు బాగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు వెక్కిళ్లను తగ్గించుకోవడానికి ముక్కు మూసుకుని శ్వాసను పట్టుకుని నీళ్లు తాగితే సరిపోతుంది. దీనివల్ల కూడా ఎక్కిళ్లు తొందరగా తగ్గిపోతాయి. మీరు మీ దృష్టినంతా ఎక్కిళ్లపైనే ఉంచితే కూడా అవి తొందరగా తగ్గవు. అందుకే ఇలాంటి సమయంలో మీరు మరొకదానిపై దృష్టి పెట్టాలి. దీంతో ఎక్కిళ్లు తొందరగా తగ్గిపోతాయి. అలాగే నిమ్మకాయ కూడా ఎక్కిళ్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఎక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మకాయ ముక్కను కట్ చేసి నోట్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
note : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. దీనిని కేవలం అవగాహన కోసం మాత్రమే రూపొందించారు.