HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Heart Problems With Paracetamol Tablets

Paracetamol : పారాసెటమాల్ టాబ్లెట్స్ తో గుండె సమస్యలు …

ఒంట్లో చిన్న నొప్పి దగ్గరి నుండి 102 జ్వరం వరకు ఏదైనా సరే ఈ టాబ్లెట్ పనిచేస్తుండడం..మార్కెట్ లో దీని రేటు కూడా తక్కువగా ఉండడం తో ప్రతి ఒక్కరి ఇంట్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ అనేవి కామన్ అయిపోయాయి

  • Author : Sudheer Date : 18-04-2024 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heart Problems With Paracet
Heart Problems With Paracet

పారాసెటమాల్ (Paracetamol ) అందరికి సుపరిచితమే..చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివారి వరకు ప్రతి రోజు ఈ పేరును తలుచుకుంటుంటారు. అంతలా ఈ టాబ్లెట్ ఫేమస్. ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ మింగేస్తుంటారు. ఒంట్లో చిన్న నొప్పి దగ్గరి నుండి 102 జ్వరం వరకు ఏదైనా సరే ఈ టాబ్లెట్ పనిచేస్తుండడం..మార్కెట్ లో దీని రేటు కూడా తక్కువగా ఉండడం తో ప్రతి ఒక్కరి ఇంట్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ అనేవి కామన్ అయిపోయాయి. కానీ ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల గుండె సమస్యలు (Heart Problems) వస్తాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పారసెటమాల్ టాబ్లెట్స్ ​పై అధ్యయనం చేశారట. ఈ అధ్యయనం లో ఈ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె లోపల అనేక సిగ్నలింగ్​ మార్గాలను మార్చడానికి కారణమవుతుందని అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ పారాసెటమాల్​ను ప్రయోగించగా.. వాటి గుండె కణజాలంలో ప్రోటీన్లు మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిలో పారాసెటమాల్​ ఇచ్చిన ఎలుకలపై ఏడు రోజులు ట్రయల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. గుండెలో పారాసెటమాల్ రెండు లేదా మూడు మార్గాలపై ప్రభావం చూపుతున్నట్లు తేలింది. అందుకే ఈ టాబ్లెట్స్ ను ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

500mg టాబ్లెట్స్​ను పెద్దలు 24 గంటల్లో నాలుగు సార్లు తీసుకోవచ్చని.. మోతాదుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలని , రోజులో 8 కంటే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కేవలం టాబ్లెట్స్ మాత్రమే కాదు సిరప్ లు కూడా ఎక్కువగా తీసుకోవద్దట. అవి కూడా గుండె కు హాని చేస్తాయని అంటున్నారు. సో ఇక నుండి తక్కువ ధర..వెంటనే పని చేస్తుందని చెప్పి రోజుకు ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోకండి. ఇప్పటికే చాలామంది గుండెనొప్పి తో కన్నుమూస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు చూస్తుండగానే కుప్పకూలి చనిపోతున్నారు. ఇక ఈ టాబ్లెట్స్ వేసుకొని మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

Read Also : Beerapottu Pachikaram : బీరపొట్టు – పచ్చికారం.. ఇలా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • heart problems
  • paracetamol tablets

Related News

Brain Fog

బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

ఒకవేళ మర్చిపోయే సమస్య మీ రోజువారీ పనులను లేదా ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంటే లేదా హఠాత్తుగా కన్‌ఫ్యూజన్, తీవ్రమైన తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

  • Cholesterol

    కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

  • Cough Syrup

    ద‌గ్గు మందు వాడుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

Latest News

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

  • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

Trending News

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd