Beard Growth: గడ్డం గుబురుగా పెరగాలి అంటే.. ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
గడ్డం బాగా గుబురుగా పెరగాలి అంటే కొన్ని ఫుడ్స్ ని తీసుకోవాలని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 12:00 PM, Wed - 4 September 24
ప్రస్తుత రోజుల్లో యువత గడ్డం పెంచడానికి చాలా ఇష్టపడుతున్నారు. గడ్డం మగవారికి అందాన్ని పెంచడంతోపాటు ఆకర్షణీయంగా కనిపిస్తుందని అందుకే గడ్డాన్ని పెంచడం ఫ్యాషన్ గా మార్చుకున్నారు యువత. కొందరికి గడ్డం బాగా వస్తే మరికొందరికి మాత్రం యుక్త వయసు దాటుతున్న కూడా గడ్డం రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంచెం కొంచెం గడ్డం రావడంతో ఇతరులను చూసి చాలామంది అబ్బాయిలు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చాలా మంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్రీడ్ ఆయిల్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. అయితే మీరు కూడా అలా గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారా..
అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్లో మనకు రకరకాల చేపలు దొరుకుతూ ఉంటాయి. ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మార్కెట్లో దొరికే చేపలలో ట్యూనా చేప కూడా ఒకటి. ఈ చేప తింటే గడ్డం పెరుగుదలలో మార్పును గమనించవచ్చట. ఈ చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హెయిర్ ఫోలికల్స్ ఏర్పడతాయి. అందుకే మీ గడ్డం, జుట్టు పెరుగుదల కోసం మీరు చేపలను తినాలని చెబుతున్నారు. చాలామంది గుమ్మడికాయ కూర చేసేటప్పుడు గుమ్మడి గింజలను పారేస్తూ ఉంటారు.
కానీ గుమ్మడి గింజలు జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడతాయట. మీ గడ్డం జుట్టును పెంచాలి అనుకుంటే గుమ్మడికాయ విత్తనాలను తినాలని చెబుతున్నారు. ఈ గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ అనే శక్తివంతమైన సూక్ష్మపోషకం పుష్కలంగా ఉంటుందట. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుందని, అందుకే వీటిని ఎండలో ర ఎండపెట్టి కాస్త ఉప్పులో వేయించి తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
మీ గడ్డాన్ని పెంచాలనుకుంటే మీ ఆహారంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల మీ గడ్డం పెరుగుదల మెరుగుపడుతుందట.
ఈ విధంగా మీరు మీ గడ్డానికి సరైన రూపాన్ని ఇవ్వవచ్చట. ఇది కాకుండా కొబ్బరి నూనెతో మీ గడ్డాన్ని మసాజ్ చేయాలనీ చెబుతున్నారు. ఇది మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. దాల్చిన చెక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. దాల్చిన చెక్కను తినడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. జుట్టు మూలాలలో రక్త ప్రవాహం మెరుగ్గా ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయట. దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చిన చెక్క నీళ్లు కలుపుకుని తాగితే ఎంతో మంచిదని చెబుతున్నారు.
Related News
Pregnancy Tips: గర్భిణీలు నువ్వులు ఎందుకు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
గర్భిణీ స్త్రీలు నువ్వులు తినే ముందు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.