Health Tips: శీతాకాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా?
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చుకుంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన సమస్యతో బ
- Author : Anshu
Date : 12-12-2023 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చుకుంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఇందుకు అనేక రకాల కారణాలు ఉండగా అందులో ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వాల్స్ బ్లాక్ అవ్వడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధుల కారణంగా మనుషుల మరణాల రేటు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే రోజువారు ఆహారపు అలవాట్లు మూలంగా గుండెపోటు లక్షణాలు పెరుగుతున్నాయి.
ఒకప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్లకి మాత్రమే గుండెపోటు వచ్చేది ప్రస్తుతం తక్కువ వయసులోనే ఉన్న వాళ్లకి కూడా గుండెపోటు వారిని పడుతున్నారు. 25 సంవత్సరాల లోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. కొంతమంది బాత్రూంలోనే గుండెపోటుతో కుప్పకూలడం లాంటివి చూస్తూనే ఉన్నాం. అయితే మనం జీవిస్తున్న జీవనశైలిని కొన్ని మార్పులు చేసుకోవడం జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచి ఆహారం తీసుకోవడం మంచిది. బ్రెయిన్ స్టోక్ వచ్చేముందు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న విషయానికి వస్తే… మైకము మాట్లాడేటప్పుడు తడబడడం, దృష్టిలో ఇబ్బంది సమతుల్యతలో సమస్యలు ముఖం చేయి లేదా కలలో తిమ్మిరి లేదా బలహీనత లేదా ఎటువంటి కారణం లేకుండా చలికాలం తీవ్రమైన తలనొప్పి లాంటి సమస్యలు వస్తుంటాయి.
అదేవిధంగా చాతి నొప్పి శ్వాస ఆడక పోవడం దవడా,మెడ ,వీపీ భుజం లో నొప్పి వికారంగా అనిపిస్తూ ఉంటుంది. చలికాలంలో చల్లని గాలులు వీచినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దమనలోని అడ్డంకి కారణంగా బ్లడ్ ప్లేకు కారణంగా మెదటి కణాలు సడన్గా కోల్పోవడం మెదడు కణాలు చనిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రధానమంటున్నారు. గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వాతావరణం మూలంగా వస్తూ ఉంటుంది. చల్లని వాతావరణం ఎక్కువ బీపీకి దారితీస్తుంది హృదయ స్పందనలు హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. ఎందుకనగా శరీరం తనను తాను హెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా చలి తీవ్రత పెరిగినప్పుడు స్ట్రోక్ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. చలికాలంలో ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఎండకు ఉండడంతో పాటుగా మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి.