Kharbuja: వామ్మో.. వేసవిలో ఖర్బూజా జ్యూస్ తాగడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా?
వేసవికాలంలో దొరికే కర్బూజా పండు జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:03 AM, Tue - 25 March 25

వేసవికాలంలో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో కర్బూజా పండు కూడా ఒకటి. కర్బూజా పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పండును తినడం లేదంటే జ్యూస్ రూపంలో తాగడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇందులో 90% నీరు ఉంటుంది. కర్బూజా పండు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మీరు వేసవిలో కర్బూజతో చేసిన జ్యూస్ కూడా తీసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా కర్బూజా కాయిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో పుదీనా ఆకులు ఉప్పు పంచదార కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్సీ పట్టుకోవాలి. కావాలి అనుకున్న వారు కొంచెం నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే శరీరం చాలా కూల్ అవుతుందట.
కర్బూజ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుందట. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుందట. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కర్బూజ ఫోలేట్ కి మంచి మూలం అని చెప్పాలి. దీనిని విటమిన్ బి9 అని కూడా అంటారు. ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుందట. కాగా కర్బూజ కాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుందట. దీనిని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుందని చెబుతున్నారు. కాగా డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు, తల తిరగడం, తలనొప్పి, మలబద్ధకం, పొడి చర్మం మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని,కాబట్టి దీనిని తినడం మంచిదని. చెబుతున్నారు.
అలాగే కర్బూజ కాయలో విటమిన్ కె, నియాసిన్, కోలిన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం మొదలైన అనేక విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కర్బూజా పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది అతిగా తినడానికి నిరోధించి కడుపు నిండుగా ఉంచి తక్కువ తినేలా చేస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.