Brinjal side effects: ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు..?
- By Anshu Published Date - 03:48 PM, Wed - 5 October 22
మన వంటింట్లో దొరికే కాయగూరలలో వంకాయ కూడా ఒకటి. చాలామంది వంకాయ కూరను ఇష్టపడి తింటూ ఉంటారు. గుత్తి వంకాయ కూర అంటే చాలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం వంకాయ తింటే అలర్జీ నవ్వలు పెడతాయి అని అంటూ ఉంటారు. వంకాయ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వంకాయ కూరను అందరూ తినకూడదు అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వంకాయ కూరను తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయట.
మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు వంకాయ కూర ని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బలహీనమైన జీర్ణవ్యవస్థతో బాధపడేవారు వంకాయ కూరలు తినకూడదు. ఒకవేళ తింటే వారికి గ్యాస్ సమస్యలు మరింత అధికమవుతాయి. అలాగే ఎలర్జీ ఉన్నవారు వంకాయను తినకూడదు. ఒకవేళ అలర్జీ ఉన్నవాళ్లు తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే డిహైడ్రేషన్ తో బాధపడే వారు కూడా వంకాయను తినకూడదు. డీహైడ్రేషన్ తో పాటు ఇతర ఆందోళనలతో బాధపడుతున్నట్లు అయితే వంకాయ కూరకు దూరంగా ఉండాలి.
అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా వంకాయ కూరను తినకూడదు. పెద్దహీనత సమస్యతో బాధపడేవారు వంకాయలను తినడం వల్ల రక్తం పెరుగుదలకు వంకాయ అడ్డంకిగా పనిచేస్తుంది. కళ్ళ లో మంట వాపు దురద వంటి సమస్యలు ఉన్నవారు వంకాయను తినకూడదు. అలాగే పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా వంకాయను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఫైల్స్ ఉన్నవారు వంకాయలు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది.