Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ లివర్ పని అయిపోయినట్లే?
శరీరంలో ఏ ఒక్క అవయం పనితీరు సక్రమంగా లేకున్నా అంతే సంగతి. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యకాలంలో మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
- By Nakshatra Published Date - 08:00 PM, Tue - 4 April 23
Health Tips: శరీరంలో ఏ ఒక్క అవయం పనితీరు సక్రమంగా లేకున్నా అంతే సంగతి. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యకాలంలో మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ డబ్బు వ్యామోహంలో పడి వచ్చే జబ్బుల గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభావితం ఎక్కువయ్యి ప్రాణాల మీదికి కూడా వస్తున్నాయి.
ఇప్పటికే 80 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. రోజురోజుకు కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక కాలేయ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. శరీరంలో అత్యంత ముఖ్యమైనది కాలేయం ఒకటి. దీనికి ఏదైనా సమస్య సంభవిస్తే మిగతా అవయవాలపై కూడా ప్రభావం ఏర్పడుతుంది. ఇక ఏ అవయవాలైన సమస్యలకు గురైనప్పుడు కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. ముందు వాటిని పసిగడితే వెంటనే వాటికి చికిత్స తీసుకోవచ్చు. లేదంటే అంతే సంగతి. ఇక లివర్ కి వచ్చే సమస్యలకు కూడా ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇంతకు అవేంటంటే..
అలసట: మామూలుగా ఏదైనా కష్టమైన పని చేస్తే అలసట రావడం సామాన్యం. కానీ నిత్యం అలసట వస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి.
అధిక బరువు: తీసుకునే ఆహారం తక్కువగా ఉన్నప్పటికీ కూడా బరువు పెరిగితే మాత్రం కాలేయం సరిగ్గా పని చేయటం లేదు అని అర్థం. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
కొవ్వును జీర్ణం చేయటంలో ఇబ్బందులు: మామూలుగా కొవ్వు పదార్థాలు తీసుకునే వెంటనే జీర్ణం అవుతూ ఉంటాయి. అయితే కాలేయం ఏదైనా సమస్య ఉంటే కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి చాలా కష్టంగా ఉంటుంది.
కడుపునొప్పి: మామూలుగా కడుపునొప్పి అనేక రకాలుగా సంభవిస్తూ ఉంటాయి. అవి వచ్చి క్షణాల్లో పోతూ ఉంటాయి. కానీ కడుపునొప్పి తరచుగా వస్తుంది అంటే కాలేయం అనారోగ్యానికి గురైందని అర్థం.
కారణం లేకుండా కోపం రావటం: మామూలుగా ఎటువంటి కారణం లేకుండా కోపమైతే రాదు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కోపాలు వస్తుంటాయని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అలాంటిదే కాలేయంలో ఏదైనా సమస్య వస్తే మానసిక ఒత్తిడితో పాటు కోపం కూడా వస్తుంది.
తలనొప్పి: ఇక తలనొప్పి అనేది కూడా సాధారణంగా అందరికీ వచ్చే సమస్య. కానీ కాలేయంలో ఏదైనా సమస్య సంభవించినట్లయితే తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది.
చర్మ సమస్యలు: కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాలేయం పనితీరు ఓపికగా లేకుంటే చర్మ సమస్యలు వస్తాయి. దీనివల్ల చర్మంపై దురద, అలర్జీ వంటివి సంభవిస్తూ ఉంటాయి.
కండరాల నొప్పి: మామూలుగా వ్యాయామం చేసే వాళ్లకు, అధిక పనులు చేసే వాళ్లకు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కానీ కాలేయ వ్యాధి ఉన్నవారిలో కండనాలను నొప్పితో పాటు కాలు తిమ్మిరి కూడా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
Tags
Related News
Packaged vs Homemade Curd: ఇంట్లో పెరుగు మంచిదా లేక ప్యాకెట్ పెరుగు మంచిదా..?
చాలామంది వేసవి కాలంలో పెరుగు తినడానికి ఇష్టపడతారు. దీన్ని తిన్న తర్వాత శరీరానికి చల్లదనం చేరి వేడిని నివారిస్తుంది.