Slate Pencils: టేస్ట్ బాగున్నాయి కదా అని బలపాలు ఇష్టంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!
బలపాలు.. వీటిని ఇంగ్లీషులో స్లేట్ పెన్సిల్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలామంది తినడానికి ఇష్టపడుతూ
- By Anshu Published Date - 10:20 PM, Tue - 26 March 24

బలపాలు.. వీటిని ఇంగ్లీషులో స్లేట్ పెన్సిల్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది వీటిని చూడగానే చిన్నప్పుడు బాగా తినే వాళ్ళం అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొందరు పెద్ద అయిన తర్వాత కూడా ఈ బలపాలని తెగ తినేస్తూ ఉంటారు. అయితే బలపాలు పెద్ద విష పదార్ధం కాదు. అయినప్పటికీ, బలపాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదు అంటున్నారు వైద్యులు. బలపాలను సున్నంతో తయారు చేస్తారు.
అదికూడా ఏ మాత్రం శుద్ధి చేయని సున్నంతో బలపాలను తయారు చేస్తారు. అందు వల్ల బలపాలు తింటే, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. యూరిన్ సమస్యలు, నోటి అల్సర్, కడుపు అల్సర్, కిడ్నీ స్టోన్స్ సమస్యలతో పాటు ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచివుందని చెబుతున్నారు. అందువల్ల బలపాలు తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే, బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో పీకా అనే సమస్య ఉంటుందట. ఇలాంటి సమస్య ఉన్నవారు మట్టి, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంది.
ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ అంటున్నారు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, గర్భిణీలలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి శరీరంలో జింక్ లోపం కూడా ఈ పీకా సమస్యకు కారణం అవుతుంది. ఇకపోతే, బలపాలు ఎక్కువగా తినే వారికి త్వరగా వారి దంతాలు పాడవ్వడం జరుగుతుంది. తరచూ జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. మలబద్ధకం, లెడ్ పాయిజనింగ్, కడుపులో నులిపురుగు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అంతేకాదు బలపాలు ఎక్కువగా తినే వారిలో ఆకలి మందగించడం కూడా చూస్తుంటాం. కాబట్టి బలపాలు తినే అలవాటు ఉన్నవాళ్లు ఇప్పటికైనా ఈ అలవాటును మార్చుకోవటం మంచిది.