Curd Rice: ప్రతిరోజు పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ప్రతిరోజు పెరుగన్నం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:27 PM, Tue - 27 August 24

మరో చాలామందికి భోజనం చేసేటప్పుడు చివరిలో పెరుగుతో పాటు పెరుగన్నం తినడం అలవాటు. చాలామందికి రోజులో కనీసం ఒక్కసారైనా పెరుగన్నం తినందే కనీసం భోజనం చేసినట్టు కూడా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి పూట లేదంటే మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగన్నం కచ్చితంగా తింటూ ఉంటారు. అయితే మరి పెరుగన్నం ను ప్రతిరోజు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు తరుచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని చెబుతున్నారు.
పెరుగన్నం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయట. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగు అన్నం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుందని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందట. దీంతో పాటు తీవ్ర చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.