Coriander: ఏంటి నిజంగానే బరువు తగ్గుతారా.. అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు!
Coriander: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర తింటే నిజంగానే బరువు తగ్గుతారా, ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sun - 7 December 25
Coriander: కొత్తిమీర.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఇది గార్నిష్ కోసం వాడే వస్తువు మాత్రమే కాదు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక శక్తివంతమైన హెర్బ్. ముఖ్యంగా కొత్తిమీర ఆకులు, వాటి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకోవడం లేదా కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట.
డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిదని చెబుతున్నారు. కొత్తిమీరలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరుకు తోడ్పడతాయట. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయట. కొత్తిమీర నీరు తాగడం వలన సాల్మొనెల్లా వంటి హానికరమైన సూక్ష్మక్రిములతో పోరాడటానికి శరీరం సిద్ధమవుతుందట. ఇది ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఉపయోగపడుతుందట. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కొత్తిమీర ఒక గొప్ప సహజ ఔషధంలా పనిచేస్తుందట. బరువు తగ్గడానికి మంచి జీర్ణక్రియ చాలా అవసరం అని చెబుతున్నారు. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు.
కొత్తిమీర నీరు తాగడం వలన శరీర జీవక్రియ రేటు మెరుగుపడుతుందట. దీని ఫలితంగా కేలరీలను వేగంగా కరిగించుకోవడానికి సహాయపడుతుందని, ఇది సులభంగా బరువు తగ్గడానికి దారితీస్తుందని చెబుతున్నారు. కొత్తిమీర నీరు తాగడం వలన ఆకలి తగ్గుతుందట. దీనిని తాగడం ద్వారా మీరు అధిక కేలరీల ఆహారాలు స్నాక్స్ తీసుకోవడం తగ్గిపోతుందని చెబుతున్నారు. తద్వారా బరువును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చట. అదేవిధంగా కొత్తిమీర శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును తొలగించడానికి సహాయపడుతుందట. కాగా కొత్తిమీర ఆకులే కాకుండా కొత్తిమీర గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. వీటిలో చాలా ఫైబర్ ఉంటుందని, వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుందని,ఆకలి కూడా తగ్గుతుందని, ఇది కూడా పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.