White Onion: ఆ వ్యాధులు నయం అవ్వాలంటే తెల్ల ఉల్లిపాయలు తినాల్సిందే?
ఉల్లిపాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూ
- By Anshu Published Date - 03:21 PM, Tue - 2 January 24

ఉల్లిపాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాగా మనకు మార్కెట్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. చాలా తక్కువగా మాత్రమే మనకు తెల్ల ఉల్లిపాయలు కనిపిస్తుంటాయి. అయితే చాలామంది ఈ తెల్ల ఉల్లిపాయలను తినడానికి అసలు ఇష్టపడరు. వాటిని తినడం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే తెల్ల ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
తెల్ల ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులకు పెట్టవచ్చు. మరి తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉల్లిలో ఎన్నో పోషకాలు ఉంటాయి పొటాషియం కూడా బాగా ఉంటుంది. ఈ తెల్ల ఉల్లిగడ్డ మనకు ఎక్కువగా ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని ఎక్కువగా పచ్చిగా తీసుకోవడం వలన మన శరీరంలో వేడిని తగ్గించి మన శరీరాన్ని చలుబరుస్తుంది. మన శరీరం అలసట నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి హైపర్ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటివారు ఉల్లిని ఎక్కువగా తింటూ ఉండాలి. ఈ ఉల్లి కంటి చూపుకి కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఈ ఉల్లి ఉదయం కొన్ని వాటిల్లోనూ పచ్చిగా తినడం వల్ల నీరసం కంటి వెంట నీరు కారడం ,చిన్న అక్షరాలు కనిపించని వారు ,ఇలా చేయడం వల్ల మంచి మేలు జరుగుతుంది. ఈ ఉల్లిపాయలను రోజువారి ఆహారం లో పచ్చి వాటిని ఎక్కువగా వాడడం వలన ఉదర సమస్యలు అంటే గ్యాస్ ,కడుపు ఉబ్బరం, అన్నం అరకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ ఉల్లిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. మన శరీరంలోని బోన్స్ ను మజిల్స్ ను గట్టి పరచడానికి ఈ ఉల్లి చాలా ఉపయోగపడుతుంది.