Wheat Rava : గోధుమరవ్వ ఉప్మా తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
గోధుమల ద్వారా తీసిన గోధుమరవ్వ అనేది మన ఆరోగ్యానికి మంచిది. గోధుమరవ్వ ఉప్మా చాల టేస్టిగా కూడా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్లు మన ఆరోగ్యానికి మంచివి
- By News Desk Published Date - 09:00 PM, Sun - 29 October 23

మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఎక్కువగా చేసుకునే టిఫిన్స్ లో ఉప్మా(Upma) ఒకటి. తక్కువ రేటులో, తక్కువ టైంలో అయిపోతుంది, కడుపు నిండుతుంది కాబట్టి చాలా మంది ఉప్మాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. వీటిల్లో అనేక రకాల ఉప్మాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో గోధుమ రవ్వ(Wheat Rava) ఉప్మా.
గోధుమల ద్వారా తీసిన గోధుమరవ్వ అనేది మన ఆరోగ్యానికి మంచిది. గోధుమరవ్వ ఉప్మా చాల టేస్టిగా కూడా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్లు మన ఆరోగ్యానికి మంచివి కాబట్టి అప్పుడప్పుడు ఇంటిలో గోధుమ రవ్వ ఉప్మా చేసిపెడుతుండాలి. పిల్లలు వద్దని మారం చేస్తే గోధుమ రవ్వ ఉప్మాలో ఉండే పోషకాలు గురించి వాళ్లకి చెప్పాలి.
* గోధుమరవ్వలో ఉండే ఫైబర్, విటమిన్ బి శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి.
* గోధుమరవ్వ తినడం వలన మన శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
* గోధుమరవ్వ తినడం వలన అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
* గోధుమరవ్వతో చేసిన ఉప్మా లేదా ఇతర పదార్థాలు తినడం వలన వాంతులు రావడం ఆగుతాయి.
* గోధుమరవ్వతో చేసిన పదార్థాలు తినడం వలన అధిక బరువు తగ్గుతారు.
* గోధుమరవ్వతో చేసిన పదార్థాలు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.
* గోధుమరవ్వ ఉప్మా తినడం వలన మన చర్మం మెరిసేలా తయారవుతుంది.
* గోధుమరవ్వ ఉప్మా మన శరీరంలో రోగ నిరోధకతను పెంచుతుంది.
* గోధుమరవ్వ ఉప్మా మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
Also Read : Oats Soup : ఓట్స్‌తో సూప్ తాగారా ఎప్పుడైనా? ఓట్స్ సూప్ తయారీ విధానం..