Thati Kallu: వామ్మో తాటికల్లు వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!
తాటికల్లు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, అచ్చమైన ఆ తాటికల్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:03 PM, Mon - 13 January 25

గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి తాటికల్లు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో తాటికల్లు పేరుతో మార్కెట్లో ఎక్కువ శాతం కల్తీ కల్లును విక్రయిస్తున్నారు. నిజమైన తాటికల్లు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో దావతులలో కల్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. కోటీశ్వరుల ఇంట్లో ఫంక్షన్ అయినా కల్లు ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. పిల్లలు, పెద్దలు, మహిళలు అన్ని వయస్సుల వారు కల్లుని తాగుతారు. ఇది తెలంగాణ కల్చర్ అని వాళ్లు చెబుతుంటారు. హైదరాబాద్ లో కూడా కల్లు అమ్మే దుకాణాల ఏర్పాటుకి కూడా ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి గీత కార్మికులు కల్లు తీస్తారు. చాలా మంది ఇప్పటికీ తాటి కల్లు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కల్లు తాగుతారు. తాటి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ తాటి కల్లు తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాటికల్లులో విటమిన్ బి,విటమిన్ సి,ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తాటికల్లు శరీర వేడిని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ దాహం తీర్చడంలో తాటికల్లు సహాయపడుతుంది. తాటికల్లుని కొంతమంది హెల్త్ టానిక్ లా వాడతారు. ఎందుకంటే ఇది శరీరానికి తేలికపాటి ఎనర్జీని ఇస్తుంది.
కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉండే ఒక సూక్ష్మజీవి కడుపులో ఉన్న క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్ కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో నివసించేవాళ్లు ప్రతిరోజు మసాల ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి కల్లు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయి.
కల్లు,నీరా మధ్య తేడా ఇదే చాలామంది కల్లు,నీరా రెండూ ఒకటే అనుకుంటున్నారు. కానీ నీరా, కల్లు మధ్య చాలా తేడా ఉంటుంది. కల్లులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. నీరాలో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు. తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి నీరా సేకరిస్తారు. అయితే ఇలా సేకరించిన నీరాని సూర్యోదయం కంటే ముందే తాగాలి. ఎందుకంటే టెంపరేచర్ ఆరు డిగ్రీలు పెరిగితే నీరా పులిసిపోయి పులసి పోయి కల్లుగా మారుతుంది. చెట్ల నుంచి కల్లు కావాలంటే నీరాలో ఈస్ట్ అనే పదార్థం కలుపుతారు. ఆల్కహాల్ కంటెంట్ ఉండటం వల్ల కల్లు తాగడం వల్ల నిషా వస్తుంది. కానీ నీరా మాత్రం కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే నీరాని చెట్టు నుంచి తీసుకొని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.