Health Benefits Raisins: ఎండు ద్రాక్షను ఈ విధంగా తీసుకుంటే చాలు.. అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం?
- Author : Sailaja Reddy
Date : 27-02-2024 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఎండు ద్రాక్ష వీటినే కిస్ మిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఎండు ద్రాక్షను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు స్వీట్లతో కలిపి తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకే వీటిని అలాగె నేరుగా తింటూ ఉంటారు. ఈ కిస్ మిస్ లో సోడియం, పాస్ఫరస్, దండిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. మహిళలు ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం వల్ల యూరిన్లో అమోనియా పెరగకుండా రాళ్లు చేరకుండా కాపాడుతుంది. చదువుకునే పిల్లలు రోజూ మూడు ఎండుద్రాక్షలను తినడం వల్ల మెదడు నరాలకు బలాన్ని ఇచ్చి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
అంతేకాకుండా ఎండు ద్రాక్ష వల్ల శరీరానికి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎండుద్రాక్ష తరచూ తినటం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది. నరాలకు బలం కలగాలంటే రక్తపోటు తగ్గాలంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవ్వాలంటే ఒక గ్లాస్ పాలలో 50 గ్రాములు ఎండు ద్రాక్ష కలిపి తినటం మంచిది. రక్తం శుబ్రపడాలంటే, నరాల బలానికి 10 ఎండు ద్రాక్షాలను కప్పు నీటిలో వేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి తాగటం వల్ల రక్తం పడుతుంది.
కాబట్టి ప్రతి రోజు రాత్రిపూట నిద్రించే ముందు ఎండు ద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటుంటే మలబద్ధక సమస్య పోయి మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఇవి మగవారికి శృంగార సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తాయి. శృంగార సమస్యలు ఉన్నవారు వీటిని తినటం వల్ల శృంగార ఆసక్తిని కలిగించి దాంపత్య జీవితం ఆనందమయం అయ్యేలా చేస్తాయి. ఇది రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్ష మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.