Peanuts: ప్రతి రోజు వేరుశెనగలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వేరుశెనగలు.. వీటినే పల్లీలు లేదా శెనగవిత్తనాలు అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కాగా ఈ వేరుశెనగలు వల
- Author : Anshu
Date : 02-02-2024 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
వేరుశెనగలు.. వీటినే పల్లీలు లేదా శెనగవిత్తనాలు అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కాగా ఈ వేరుశెనగలు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని చాలా రకాల కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వేరుశెనగలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని తరచూ తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మరి ప్రతిరోజు వేరుశెనగలు తినవచ్చా, తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేరుశెనగల్లో అనేక రకాల శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. రిస్వరెట్రాల్, ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్స్, ఆర్గైనైన్, ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వేరుశెనగలను రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వేరుశెనగలను తినడం వల్ల కొందరిలో అలర్జీలు వస్తాయి. కనుక అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఇక మిగిలిన ఎవరైనా సరే వేరుశెనగలను రోజూ తినవచ్చు. రోజూ వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. అలాగే అధిక బరువు సమస్యకు చెప్పి పెట్టవచ్చు. పల్లీలు తరచూ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.
వేరుశెనగలను రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వేరుశెనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. శక్తిని అందిస్తాయి. కణాలను మరమ్మత్తు చేస్తాయి. వేరుశెనగల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు వయస్సు మీద పడే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.