Muskmelon: వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
వేసవికాలం మొదలైంది.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే
- By Nakshatra Published Date - 04:33 PM, Mon - 24 April 23
వేసవికాలం మొదలైంది.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు.. ఎండాకాలం ఎక్కువ శాతం మంది డీహైడ్రేషన్ కు గురవుతూ ఉంటారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలి అంటే తగినంత నీళ్లు తీసుకోవాలి. దాంతో ఎక్కువమంది కూల్ వాటర్ తాగుతూ ఉంటారు. ఎక్కువ నీటిని తీసుకోకుండా వాటర్ బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇక వేసవిలో మనకు పుచ్చకాయ దోసకాయ అలాగే కర్బూజా పండు లాంటి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.
వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. మరి వేసవిలో దొరికే కర్బూజా పండు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కర్బూజా పండ్లు తినడం వల్ల వేసవికాలంలో ఎండల నుండి రక్షణ పొందవచ్చు. పుచ్చకాయ కంటే కర్బూజా పండులో ఐదు శాతం మీరు ఎక్కువగా ఉంటుంది. అనగా 95 శాతం నీరు ఉంటుంది. కర్బుజా పండులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఏ లభిస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి. కర్బుజా పండు గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న అధిక నీటి శాతం ఉండడం వల్ల అది మీ శరీరాన్ని డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది.. అలాగే ఈ పండు లో ఆర్గానిక్ పిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
అలాగే యూదు కళ్ళకు చాలా మేలు చేస్తుంది. మధుమేహం ఉన్న వారు కూడా కర్బుజాని తినవచ్చు. ఇది రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు ముక్కలు తిన్న లేదంటే ఒక గ్లాస్ జ్యుస్ తగిన త్వరగా ఆకలి అవ్వదు. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎండాకాలం డిహైడ్రేషన్ కు గురవ్వకుండా ఉండాలి అంటే ఎండాకాలంలో దొరికే ఇటువంటి పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి.
Related News
Summer: సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం మస్ట్.. ఎందుకంటే
Summer: వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యం. వేసవిలో లిక్విడ్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో నీటి కొరత లేకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగండి. దీని కారణంగా, శరీరంలో తగినంత శక్తి, ఖనిజాల సమతుల్యత ఉంది. వేసవిలో ఎప్పుడైనా కొబ్బరి న�