Jujube: రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం!
Jujube: రేగి పండ్ల వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ఇవి ఎన్నో రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా కూడా పని చేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:32 AM, Tue - 28 October 25
Jujube: మాములుగా మనకు సీజన్ లలో లభించే పండ్లలో రేగి పండ్లు కూడా ఒకటి. ఈ పండ్లు మనకు చలికాలంలో మాత్రమే లభిస్తాయి. శీతాకాలం ప్రారంభం కాగానే వచ్చే సీజనల్ పండ్లలో రేగు పండ్లు కూడా అతి ముఖ్యమైనవని చెప్పాలి. రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాగా రేగు పండ్లలో కాల్షియం ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఎముకలు గట్టిగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
అందువల్ల ఈ సీజనల్ పండును తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయట. రేగు పండ్లు రక్తహీనత నుంచి మనల్ని కాపాడతాయి. రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నందున రేగు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రోజువారీ ఆహారంలో రేగు పండ్లను చేర్చడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చట. రేగు పండ్ల శోథ నిరోధక చర్య కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా రేగు పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట.
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని,ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుందని చెబుతున్నారు. రేగు పండ్ల పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుందట. రేగులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుందట. ఆకలిని అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి రేగుపండు సహాయపడుతుందట. రేగు పండ్లను ముక్కలుగా చేసి తేనెలో నానబెట్టుకుని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుందట. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రేగు పండ్లను తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందుతారు. రేగులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుందట.