HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Jamun Java Plum Lower Blood Sugar

Jamun Fruit: వగరుగా ఉంటాయని నేరేడు పండ్లను అవాయిడ్ చేస్తున్నారా.. ఇది తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు!

నేరేడు పండు తినడానికి ఇష్టపడని వారు ఇప్పుడు చెప్పబోయే విషయాలను తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి నేరేడు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 24-05-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jamun
Jamun Fruit (2)

మనకు వేసవికాలంలో దొరికే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నేరేడు పండ్లతో పాటు వాటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి మధుమేహం ఉన్నవారికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడంలో ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి.

నేరేడు పండు తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందట. మధుమేహం వల్ల వచ్చే అధిక మూత్ర విసర్జన దాహాన్ని నియంత్రించడంలో కూడా నేరేడు పండు సహాయపడుతుందట. ఈ రోజుల్లో చాలా మంది బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారు రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక పనులు చేస్తుంటారు. అలాంటివారికి నేరేడు పండు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఇందులో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. దీనితో పాటు, సోడియం, కాల్షియం, ఇనుము, కార్బోహైడ్రేట్లు నేరేడు పండ్లలో కనిపిస్తాయని చెబుతున్నారు.

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటైన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో నేరేడు పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటుందట. ఇది సాధారణ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుందని, మీరు మీ గుండెని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే క్రమం తప్పకుండా నేరేడు పండు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని, పొటాషియం అధిక రక్తపోటు వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా నేరేడు పండులో లోపల కనిపిస్తాయట. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయట. నేరేడులో ఉండే సైనిడిన్ పెద్దప్రేగు క్యాన్సర్‌ ను నివారించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Blood sugar
  • Health Benfits
  • health tips
  • Jamun Fruit
  • Jamun Fruit benefits
  • sugar problems

Related News

Sleeping At Night

భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్రలేచిన తర్వాత కడుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదించి ఆహారం అలాగే ఉండిపోతుంది.

    Latest News

    • రియల్ ఎస్టేట్ ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్

    • అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    Trending News

      • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd