Ghee Coffe: ఆరోగ్యాన్ని మరింత పెంచే కాఫీ.. ఏ సమయంలో తాగాలో తెలుసా?
మామూలుగా ఉదయం లేవగానే చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది కాఫీ టీ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. కొంతమంది ఉద
- By Nakshatra Published Date - 10:00 PM, Wed - 9 August 23
మామూలుగా ఉదయం లేవగానే చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది కాఫీ టీ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. కొంతమంది ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత కాఫీ తాగితే మరికొందరు బెడ్ కాఫీ కూడా తాగుతూ ఉంటారు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఆ రోజంతా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండవచ్చు. కాఫీ తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం అనేక రకాల సమస్యలు తప్పవు. అయితే కాఫీ లవర్స్ రకరకాల కాఫీలను టేస్ట్ చేస్తూ ఉంటారు. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ అంటూ బోలెడు కాఫీలు తాగుతూ ఉంటారు. మరీ ఘీ కాఫీ ఎప్పుడైనా టేస్ట్ చేశారు. నెయ్యి కాఫీ ఏంటా అని అనుకుంటున్నారా! వినడానికి కాస్త వెరైటీగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు.
మరి ఘీ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఘీ కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. కప్పు కాఫీలో టేబుల్ స్పూను నెయ్యి కలిపి పరగడుపునే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. కాఫీకి నెయ్యి కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఘీ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తింటే ఇన్సులిన్ నెమ్మదిగా విడుదల అవుతుంది. డయాబెటిస్, జీవక్రియ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యి కాఫీతో మరింత ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, మహిళల్లో హార్మోనుల్లో అసమతుల్యత పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఘీ కాఫీ సహాయపడుతుంది. ఈ ఘీ కాఫీతో డే ప్రారంభిస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
నెయ్యిలో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ , ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. హెల్తీ ప్యాట్స్తో రోజును ప్రారంభిస్తే ఆరోజంతా మీరు ఎనర్జిటిక్‌గా ఉండటమే కాకుండా తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. దీంతో బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు. ఇది తాగితే బెల్లీ ప్యాట్ కాడా కరుగుతుంది. నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేయడమే కాకుండా త్వరగా శక్తినిస్తుంది. దీన్నో కొవ్వు పదార్థంగా చూస్తాం కానీ.. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. అలా బరువును అదుపు చేయడంలోనూ సాయపడుతుంది. దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ ఘీ కాఫీని పరగడుపున తాగితే మంచిది. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకుంటే శరీరానికి ఫ్యూయల్‌గా పని చేస్తుంది. రోజులో రెండుసార్లకు మించి మాత్రం ఈ కాఫీ తాగొద్దు. సాయంత్రం 5 తర్వాత దీన్ని తీసుకోకూడదు. దానివల్ల నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
Related News
Papaya: బొప్పాయితో ఎన్నో రకాల లాభాలు.. కానీ ఇలా తింటే మాత్రం!
బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పండ్లు మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయిని పోషకాల నిధి అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, ఎటమిన్ సి ఇలా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండడం ఒక విశేష�