Guava: ఏంటి.. జామకాయలు తింటే అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయా!
జామపండు తినడం వల్ల అనేక రకాల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Thu - 24 October 24

జామకాయ గురించి జామకాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జామకాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. జామకాయల్లో విటమన్ సి మెండుగా ఉంటుంది. జామకాయలో విటమిన్ సి నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాగా ఈ విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంతో అంటు వ్యాధులు, ఇతర రోగాలకు మనం దూరంగా ఉంటాం. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జామ కాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒక జామకాయలో 3 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. జామకాయ తినడం మలబద్దకం సమస్య రాదట. జామకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగవట. అలాగే జామకాయ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. దీనిలోని పొటాషియం గుండెను సంరక్షిస్తుందట. పొటాషియం ముఖ్యమైన ఖనిజం. ఇది అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుందని, అలాగే గుండె ఆరోగ్యాన్నికాపాడుతుందని చెబుతున్నారు.
జామ కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి. జామ కాయల్లో లైకోపీన్ మెండుగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ పండు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట. జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. మన చర్మాన్ని కాంతి వంతంగా, ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. ఇది మన చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.