Overripe Bananas: బాగా పండిన అరటిపండ్లు పడేస్తున్నారా.. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే
బాగా పండిన అరటిపండు వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- Author : Anshu
Date : 04-12-2024 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. ధర కూడా చాలా తక్కువ. ఈ అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పచ్చిగా ఉన్న అరటి పండు కాకుండా పూర్తిగా పండిన అరటి పండులో టన్నుల కొద్ది పోషకాలు ఉంటాయి. ఇది సులభంగా జీర్ణం అవడంతో పాటు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. గ్యాస్ మలబద్ధకం అసిడిటీ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
సాధారణంగా పండిన అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు, ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటిపండు ఉపయోగపడుతుంది. అరటి పండ్లు అల్సర్స్ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తీసుకొనవచ్చు. అలాగే, పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.
ఒక మోస్తరుగా పండిన అరటి పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచి హైబీపీని తగ్గిస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లను తింటేనే శక్తి బాగా లభిస్తుంది. దీంతో అలసిపోకుండా పనిచేయవచ్చు. పండిన అరటి పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది అనీమియా సమస్యను నివారిస్తుంది. పండిన అరటి పండ్లను తినడం వల్ల మీ రక్త స్థాయిలను సహజ సిద్దంగా పెంచడానికి సహాయపడుతుంది. బాగా పండిన అరటి పండ్లను తింటే శక్తి బాగా లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. నీరసం, నిస్సత్తువ తగ్గిపోతాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి కొంచెం మెత్తగా అయ్యిందని బాగా పండిపోయిందని అరటిపండును అసలు పడేయకండి.