Litchi Fruit: లిచీ పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
లిచీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:04 AM, Sun - 26 January 25

లిచీ పండ్లు.. మొన్నటి వరకు ఈ పండ్లను చాలా తక్కువ మంది మాత్రమే వారు. కానీ ఇటీవల కాలంలో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు వీటిని తినకుండా ఉండలేకపోతున్నారు. దీని రుచి కాస్త తీయగా కాస్త పుల్లగా జూసీగా ఉంటుంది. పైన ఆరెంజ్ కలర్ లో పింక్ కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లీచీ పండ్లు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లిచీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని నిరోధించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. లీచీలో ఉండే పోలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని కణాలను రక్షిస్తాయి. లిచీ పండు గుండెకు మేలు చేసే గుణాలను కలిగి ఉంటుందట. అలాగే ఇందులో పోటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయట. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఈ పండు బరువును నియంత్రణలో ఉంచుతుందట. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం ఉండడం వల్ల ఇది బరువు తగ్గేందుకు అనుకూలంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
లిచీ పండులో ఉండే ప్రత్యేకమైన పాలీఫెనాల్స్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. ఇవి కాలేయాన్ని శుద్ధి చేయడంలో, దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పండులో అధిక పరిమాణంలో నీరు ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే అజీర్తి సమస్యలను తగ్గించడానికి కూడా ఎంతో బాగా పనిచేస్తాయి.. లీచీలో ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందట. దీని వల్ల అనారోగ్యాలకు లోనయ్యే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఈ పండు కంటి సమస్యలను నివారించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఈ పండు అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల ఇది శరీరానికి తేమను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అలాగే వేసవి కాలంలో ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుందట.