Ladies Finger: బెండకాయ ప్రతిరోజు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మరి ప్రతిరోజు బెండకాయలు తీసుకోవచ్చా? బెండకాయ ప్రతిరోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Thu - 5 December 24

మన వంటింట్లో దొరికే కాయగూరలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెండకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ బెండకాయ ను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలామంది బెండకాయ వేపుడుగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అన్నం పప్పు రసం వంటి వాటిలోకి మంచుకోవడానికి ఈ బెండకాయ వేపుడు ఎక్కువగా తింటూ ఉంటారు. కొందరు వారంలో కొన్ని రోజులు తీసుకుంటే మరికొందరు ప్రతిరోజు బెండకాయలు తీసుకుంటూ ఉంటారు. మరి ప్రతిరోజు బెండకాయలు తీసుకోవచ్చా? బెండకాయ ప్రతిరోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వర్షాకాలంలో బెండకాయలను తరచుగా తినాలి. ఎందుకంటే ఈ కూరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బెండకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అంటు వ్యాధులు, ఇతర రోగాల ముప్పు కూడా తప్పుతుంది. అలాగే బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బెండకాయ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
అలాగే ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఈ కూరగాయ మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే బెండకాయ డయాబెటీస్ పేషెంట్లు పుష్కలంగా తినవచ్చు. బెండకాయ ఆహారాల నుంచి కార్బోహైడ్రేట్లను తీసుకోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. బెండకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మధుమేహులు రోజూ తినవచ్చు. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బెండకాయ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అందుకే పిల్లలకు ప్రతిరోజూ అన్నంతో పాటుగా బెండకాయ వంటకాలను పెట్టడం మంచిదనీ చెబుతున్నారు. బెండకాయను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది. బెండకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయనీ చెబుతున్నారు..