Guava Leaves: పరగడుపున జామ ఆకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
పరగడుపున జామ ఆకులు తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు..
- By Anshu Published Date - 11:20 AM, Fri - 4 October 24

జామకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సీజనల్ పండ్లలో జామకాయ కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే కేవలం జామకాయల వల్ల మాత్రమే కాకుండా జామ ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. మరి జామ ఆకుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అదేవిధంగా జామ ఆకులను పరగడుపున తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. జామ ఆకులను నమలడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చట. ఖాళీ కడుపుతో జామ ఆకులను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల ఎన్నో రోగాల నుంచి బయటపడవచ్చట. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందట. దీంతో మలబద్దకం, అజీర్థి, ఎసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. అందుకే జామ ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బరువు తగ్గుతారట.
ఇది మీ కడుపును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జామ ఆకుల్లో ఉండే ఎన్నో సమ్మేళనాలు మీ బరువును తగ్గిస్తాయట. ఇవి మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయని దీంతో సులువుగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దీంతో మీరు ఎన్నో వ్యాధుల నుంచి బయపడవచ్చని చెబుతున్నారు. రోగాలు కూడా త్వరగా నయమవుతాయని చెబుతున్నారు. జామ ఆకులను తరచుగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
ఈ ఆకుల్లో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందట. ఇది మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుతుందని చెబుతున్నారు. జామ ఆకులను తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట. జామపండు మాదిరిగానే దీని ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పొటాషియం మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందట. అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.