Coconut: కొబ్బరి తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
కొబ్బరినీళ్లు,కొబ్బరి పాల వల్ల మాత్రమే కాకుండా కొబ్బరి వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:04 AM, Thu - 6 March 25

మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కొబ్బరి ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది పచ్చి కొబ్బరి తింటే మరి కొంతమంది ఎండు కొబ్బరి తింటూ ఉంటారు. కొబ్బరిని తినడంతో పాటు చాలా రకాల వంటల్లో స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంతకీ కొబ్బరి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఇనుము, పొటాషియంతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
దీన్ని తింటే మన శరీరానికి లోపలి నుంచి పోషణ అందుతుందట. ఈ పోషకాలు మన రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయట. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట. ముఖ్యంగా అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుందట. కాగా కొబ్బరి మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఎలా అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది..ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచడంతో పాటుగా ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. అదేవిధంగా దీర్ఘకాలిక మంట గుండె సంబంధిత బాధలతో బాధపడేవారు కొబ్బరిలో షోత నిరోధక లక్షణాలు ఉంటాయి.
అలాగే లారిక్ ఆమ్ల శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయట. అంటే కొబ్బరిని తింటే మంట తగ్గుతుంది. అలాగే మంట వల్ల కలిగే సమస్యల ముప్పు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అదేవిదంగా కొబ్బరిలో మీడియం చైన్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయట. ఇవి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయట. ఇవి మన శరీరానికి హానిచేసే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఈ సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయట. కొబ్బరి నూనె పుల్లింగ్ నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుందట. అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.