Diabetes : షుగర్ పేషంట్లు…గుమ్మడికాయ జ్యూస్ ప్రయోజనాలు తెలుస్తే వదిలిపెట్టరు..!!
తీపి గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని వినియోగం ఆరోగ్యానికే కాకుండా మీ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. గుమ్మడికాయలు చాలా పోషకమైనవి, రుచికరమైనవి. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
- By hashtagu Published Date - 06:35 AM, Thu - 21 July 22

తీపి గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని వినియోగం ఆరోగ్యానికే కాకుండా మీ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. గుమ్మడికాయలు చాలా పోషకమైనవి, రుచికరమైనవి. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుమ్మడికాయ రసం కీళ్ల నొప్పులను, అలసటను దూరం చేస్తుంది. గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ డి, కాపర్, ఐరన్, ఫాస్పరస్ ఎంతో పోషకమైనవి. అంతేకాదు..గుమ్మడికాయ రసంలో విటమిన్ B1, B2, B6, C, E బీటా కెరోటిన్ కూడా ఉంటాయి.
జుట్టుకు మేలు చేస్తుంది:
జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం తాగండి. ఇది జుట్టు రాలే సమస్యను దూరం చేయడమే కాకుండా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిజానికి గుమ్మడికాయ రసంలో పొటాషియం ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, గుమ్మడికాయ రసం తాగడం ప్రారంభించండి. ఇది మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే గుమ్మడికాయ రసంలో తేనె కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.
ఉదర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది:
మీకు మలబద్ధకం సమస్య ఉంటే గుమ్మడికాయ రసం తీసుకోవచ్చు. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం, అల్సర్, గ్యాస్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు, దీని రసాన్ని తీసుకోవడం వల్ల మూత్ర వ్యవస్థ పటిష్టం అవుతుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో పాలీశాకరైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు, ప్యూరరిన్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
గుమ్మడికాయ రసంలో విటమిన్ సి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.