Donkey Milk Benefits: గాడిద పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
మామూలుగా మనం ఎక్కువగా ఆవు పాలు లేదంటే గేదె పాలను తాగుతూ ఉంటాం. ఎక్కువ శాతం మనం గేదె పాలనే తాగుతూ ఉంటాం. చాలా తక్కువ మంది మాత్రమే ఆవు పాలను
- By Anshu Published Date - 09:20 PM, Sun - 18 June 23

మామూలుగా మనం ఎక్కువగా ఆవు పాలు లేదంటే గేదె పాలను తాగుతూ ఉంటాం. ఎక్కువ శాతం మనం గేదె పాలనే తాగుతూ ఉంటాం. చాలా తక్కువ మంది మాత్రమే ఆవు పాలను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి రెండూ కాకుండా మంచి డిమాండ్ ఉన్న పాలు అంటే గాడిద పాలు అని చెప్పవచ్చు. గాడిద పాలు లీటరు దాదాపు 700 800 రూపాయలు ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాటికి ఉన్న డిమాండ్ అలాంటిది. గాడిద పాలల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అంతేకాకుండా గాడిద పాలల్లో ఉండే ఔషధ గుణాలు తల్లి పాలలో ఉండే ఔషధ గుణాలకు చాలా దగ్గరగా ఉంటాయి.
అలాగే ఒక్కో గాడిద రోజుకు ఒకటీ రెండు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వదని చెబుతారు. ఈ కారణాల వల్లే గాడిద పాలకు విపరీతమైన డిమాండ్, ధర ఉంటుంది. మరి గాడిద పాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు. గాడిద పాలలో యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆఫ్రికాతో పాటు భారత్ లో గాడిద పాలను దగ్గుకు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే..
గాడిద పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అందుకే 19వ శతాబ్దంలో అనాథ శిశువులకు తల్లి పాలకు బదులు గాడిద పాలు ఇచ్చేవారట. గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ శక్తి వనరు. వేసవిలో గాడిద పాలు తాగితే తక్షణ శక్తి వస్తుంది. అలాగే గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి1, బి2, బి6, సీ, డి, ఈ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. గాడిద పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అదేవిధంగా గాడిద పాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించడానికి సహాయపడతాయి. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచి ఎంపిక అవుతుంది. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మపు చికాకును తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్-ఇ గాడిద పాలలో సమృద్ధిగా ఉంటుంది. గాడిద పాలు తగ్గడం వల్ల చర్మ ముడతలు తగ్గుతాయి.