HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Consuming Ginger

Ginger Benefits: ప్రతిరోజు అల్లం తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

ప్రతిరోజు అల్లం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని కానీ అల్లం తినే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 17-03-2025 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ginger Benefits
Ginger Benefits

అల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అల్లం ని ఎన్నో రకాల వంటలు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఘాటైనా వాసన రుచిని కలిగి ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే అల్లంని ప్రతిరోజు తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.

ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయపడుతుందట. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుందని, అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా కూడా అనిపించదు అని చెబుతున్నారు. అయితే అలాంటి వారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుందట. అలాగే అల్లం జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందట. శరీరంలో ఉండే అదనపు కొవ్వు కరిగించి బరువు తగ్గడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట.

జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్ను పూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. అల్లం రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు వ్యాధుల నుంచి కూడా శరీరంని రక్షిస్తుందట. అలాగే చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు జుట్టును బలంగా ఒత్తుగా కూడా ఉంచుతుందని చెబుతున్నారు.

ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందట. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌ కు సహాయపడుతుందని, ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Ginger
  • ginger
  • ginger benefits
  • health tips

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd