Black Pepper: ప్రతిరోజు మిరియాలు తింటే చాలు.. ఈ సమస్యలు రమ్మన్నా రావు?
ప్రతిరోజు మిరియాలు తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Fri - 20 September 24

మిరియాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చాలా ఘాటుగా కారంగా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలా మంది వీటిని తినడానికి అసలు ఇష్టపడరు. అవి కారంగా ఉంటాయని కొరికినప్పుడు ఘాటుగా ఉంటాయని చాలామంది వీటిని అస్సలు ఇష్టపడరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రతిరోజు మిరియాలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు అసలు రావట. మరి మిరియాలు ప్రతిరోజు తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరి చేరవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తరచుగా జలుబు దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుందట. నల్ల మిరియాలలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, సోడియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పైపెరిన్ అని పిలువబడే బయోయాక్టివ్ సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది నల్ల మిరియాలు ఫుడ్ రుచిని పెంచుతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నల్ల మిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నల్ల మిరియాలను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి కూడా మిరియాలు ఎంతో సహాయపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా నల్ల మిరియాల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్ లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సయాటికాను నివారించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. చలికాలంలో మీ రోజువారి ఆహారంలో నల్ల మిరియాలు చేర్చడం వల్ల తుమ్ములు, దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందుతారు. ఈ మిరియాలు ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.