Coconut Flower: వామ్మో కొబ్బరి పువ్వు వల్ల ఏకంగా అన్ని రకాల లాభాల.. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కొబ్బరి పువ్వు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:01 PM, Mon - 17 March 25

కేవలం కొబ్బరికాయ వల్ల మాత్రమే కాకుండా కొబ్బరి వల్ల అలాగే కొబ్బరి నీళ్ళు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొబ్బరికాయలోని ప్రతి ఒక్క భాగం ఉపయోగపడేది. అదే మనం ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు రావడం చూసే ఉంటాం. ఈ మధ్యకాలంలో రోడ్డుకి ఇరువైపులో ఎక్కడ చూసినా కూడా కొబ్బరి పువ్వు వచ్చిన కొబ్బరికాయలను అదేపనిగా అమ్ముతున్నారు. ఈ కొబ్బరి పువ్వు కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది అంతగా ఇష్టపడరు.
అయితే కొబ్బరి పువ్వు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా పువ్వు శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుందట. కొబ్బరి నీటితో పోల్చితే కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ఉంటాయట. కొబ్బరి పువ్వు గురించి చాలా మందికి తెలియదు. ఈ పువ్వు థైరాయిడ్ సమస్యలు, కాలం తిరుగుడు ఇన్ఫెక్షన్లకు రక్షణగా పనిచేస్తుందట. కాగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి పువ్వు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట.
అలాగే కొబ్బరి పువ్వు క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుందట. ఇది ఇన్సులిన్ స్రావాన్ని కూడా ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. తద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందట. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందట. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు ప్రేగులను రక్షించి మలబద్ధకాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాగా కొబ్బరి పువ్వు మంచి రోగనిరోధక శక్తిని కలిగిస్తుందట. అది కొబ్బరి నీటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుందట.
కాగా కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయట. చర్మానికి ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే మూత్రపిండాలకు కూడా రక్షణగా నిలుస్తుందట. దీనివల్ల మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. శారీరకంగా అలసినవారు ఈ పువ్వు తింటే శక్తి పెరుగుతుందట. అదేవిధంగా కొబ్బరి పువ్వు గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుందట. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుందట. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో కొబ్బరి పువ్వు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు..