Cabbage in Winter: చలికాలంలో క్యాబేజీని తప్పకుండా తినాలంటున్న వైద్యులు.. ఎందుకో తెలుసా?
శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో క్యాబేజీ కూడా ఒకటని, ఈ క్యాబేజీని తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:07 AM, Sun - 29 December 24

నిత్యం ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సీజన్లకు తగ్గట్టుగా కొన్ని కొన్ని రకాల కూరగాయలను తప్పుడు సరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతూ ఉంటారు. ఇకపోతే చలికాలంలో వచ్చే సీజనల్ కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. కొంతమంది క్యాబేజీతో రకరకాల కూరలు చేసుకుని తింటే మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్యాబేజీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి ముఖ్యంగా చలికాలంలో క్యాబేజీని తప్పకుండా తినాలని వైద్యులు చెబుతున్నారు.
మరి చలికాలంలో క్యాబేజీని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. క్యాబేజీ మధుమేహం, థైరాయిడ్ సమస్యలతో కూడా సమర్థవంతంగా పోరాడుతుంది. అలాగే క్యాబేజీలో ఎక్కువ మొత్తంలో నీరు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది రోజంతా మనకు కావాల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పాలి. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కె, సి కూడా అధికంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అలాగే గుండె సమస్యలు క్యాన్సర్ నుండి క్యాబేజీ రక్షిస్తుందట. క్యాబేజీలో యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. డయాబెటిక్ నెఫ్రోపతీ నుంచి రక్షిస్తుంది. క్యాబేజీలో గ్లూకోసినోలేట్, సల్ఫర్ ఉంటాయి.
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్ లో సులభంగా దొరుకుతుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్లు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమ బద్ధీకరించి బీపీని తగ్గిస్తుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కడుపులో అల్సర్ లను కూడా నివారిస్తుంది. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. క్యాబేజీ శరీరంలో మంటను కూడా తొలగిస్తుంది. దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు ఆరోగ్యంగా ఉంటారు. క్యాబేజీలో పెద్ద మొత్తంలో విటమిన్ కె, అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉన్నందున మెదడు కణాల అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశాన్ని కూడా నివారిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. క్యాబేజీతో వివిధ రకాల వంటలు కూడా చేయవచ్చు. పచ్చి సలాడ్ నుంచి వేడి సూప్ వరకు, రుచికరమైన స్టీమ్డ్ మోమో, స్ప్రింగ్ రోల్, పల్యా, సాంబార్, పలావ్, పరాటా, ఉత్తప్ప వంటి ఎన్నో రుచిగల వంటకాలు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.