HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Adding Raw Ginger To Your Winter

Health Benefits of Ginger: చలికాలంలో అల్లాన్ని పచ్చిగా తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

చలికాలంలో అల్లంని పచ్చిగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, పలు సమస్య లకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 22-01-2025 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Benefits Of Ginger
Health Benefits Of Ginger

అల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. అల్లంలేని వంటిల్లు ఉండదు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందట. కూరల రూపంలోనే కాకుండా పచ్చిగా తిన్నా కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. మరి అల్లం పచ్చిగా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. చలికాలంలో చాలామంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి పచ్చి అల్లం తినడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట. చలికాలంలో పెద్దల నుంచి పిల్లలవరకు ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది.

ఆ సమయంలో మీరు అల్లాన్నీ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు కూడా తగ్గుతాయట. అల్లం లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తాయి. ఆర్థ్రరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంట. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుందట. అలాగే అల్లం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తుందట. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతే కాకుండా బీపీని అదుపులో ఉంచి హార్ట్ ఎటాక్స్ వంటివి రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. చలికాలంలో బద్ధకంగా ఉండడం వల్ల శరీరంలో రక్తప్రసరణ ఉండదట. ఇది లేకుంటే మీరు యాక్టివ్​ గా ఉండలేరట. పైగా నీరసం వస్తుందట.

స్కిన్​ టోన్ కూడా మారిపోతుందని చెబుతున్నారు. జుట్టు ఎక్కువగా రాలిపోతుందట. అయితే అల్లం శరీరంలో రక్తప్రసరణను మెరుగు చేసి మీరు యాక్టివ్​ గా ఉండేలా హెల్ప్ చేస్తుందట. వింటర్​లో పగలు సమయం తక్కువగా ఉంటుంది. దీనివల్ల వర్క్​ చేయడంలో ఇబ్బందులు పెరిగి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కాస్త అల్లాన్ని చప్పరిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుందట. అలాగే అల్లంలోని యాంటీబాక్టిరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చలికాలంలో వచ్చే ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయట. అంతే కాకుండా వీటిలోని యాంటీ క్యాన్సర్​ లక్షణాలు వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేస్తాయట.

బరువు తగ్గాలనుకునేవారు అల్లాన్ని తమ డైట్​ లో తీసుకోవచ్చట. ఇది మెటబాలీజంను పెంచి శరీరంలో కేలరీలు కరిగేలా చేస్తూ ఉండిz బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందట. చలికాలంలో బరువు తగ్గడం కష్టమనుకునేవారు తమ రెగ్యూలర్ వ్యాయమాలు డైట్​ లతో పాటు దీనిని కూడా కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. ఆరోగ్య సమస్యలు లేనివారు హెల్తీగా ఉండేందుకు 1 నుంచి రెండు అంగుళాల అల్లాన్ని తినవచ్చట. ఒకవేళ మీరు జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కోసం తినాలకుంటే 2 నుంచి 3 అంగుళాలు తీసుకోవచ్చట. జీర్ణ సమస్యలను తగ్గించుకునేందుకు అర అంగుళం తింటే సరిపోతుంది. అయితే అల్లం ఫ్రెష్​గా ఉండాలి. పైన తొక్క తీసేసి చిన్నగా కట్ చేసుకుని తేనెతో కలిపి రోజూ తినవచ్చని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ginger
  • health benefits
  • Health Benefits of Ginger
  • health tips

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Benefits of eating pistachios this season!

    Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd