Peanuts: పల్లీలు తింటే బరువు తగ్గుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
పల్లీలు లేదా వేరుశనగ విత్తనాలు వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో కేలరీలు,ప్రోటీన్, కార్బోహైడ్రేట
- By Nakshatra Published Date - 09:45 PM, Fri - 28 July 23
పల్లీలు లేదా వేరుశనగ విత్తనాలు వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో కేలరీలు,ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు,క్రొవ్వులు ఫైబర్ లభిస్తాయి. పల్లీల్లో ఫైబర్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. వేరుశనగలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాపడతుంది. వేరుశనగలో ప్రోటీన్ మొత్తం కేలరీలలో దాదాపు 25 శాతం ఉంటుంది. నట్స్‌లో ఉండే ఎక్కువ ప్రోటీన్, పీచు పదార్థం మనల్ని ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది. అందువల్ల వారు ఒక వ్యక్తి బరువుని మెంటెయిన్ చేస్తారు.
సీడ్స్ తినే వారు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కూడా వాటిని తినని వారి కంటే కాలక్రమేణా తక్కువ బరువు పెరుగుతారు. అయితే ఏదైనా సరే తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. పోషకాహార నిపుణులు జంక్, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి ప్రత్యామ్నాయంగా గింజలను తీసుకోవాలి. చాలామంది ఎక్కువ ధర ఉన్న నట్స్‌తో ఎక్కువ లాభాలు అని చెబుతారు. కానీ, ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఇండియాలో పల్లీలు ఎక్కువగా లభిస్తాయి. విదేశాల్లో దొరికే ఇతర నట్స్‌లానే ఇవి పోషకమైనవి. పల్లీల్లో లభించే పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. పల్లీలు తింటే అలర్జీ అనేది తక్కువగా ఉంటుంది.
ఇది తీవ్రమైన అలర్జీలలో ఒకటిగా చెబుతారు. పల్లీల్లో అరాచిన్, కోనరాచిన్ అనే రెండు ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తినే వ్యక్తులకు కొన్ని సార్లు ప్రమాదంగా మారుతుంది. అయితే, వీటిని తింటే అలర్జీలు రావడం కంటే.. తినేటప్పుడు మాత్రమే అలర్జీ ప్రతి చర్యలకు కారణమవుతాయి .బరువు తగ్గాలి అనుకున్న వారు వేరుసెనగలను తినక పోవడమే మంచిది. అలాగే ఎక్కువగా వేరుశనగలను తినడం వల్ల కొంతమందికి అలర్జీలు వస్తూ ఉంటాయి. అంటే ముక్కు కారడం దద్దుర్లు, దురద, వాపు, గొంతు నొప్పిలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది టేస్ట్ కోసం ఉప్పు కలిపిన వేరుశనగలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ ఉప్పు కలిపిన వేరుశెనగలు శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతాయి. తద్వారా రక్తపోటు గుండె జబ్బులు లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
దీంతో రక్తపోటు విపరీతంగా పెరగడంతో పాటు గుండె కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో వీరు వేరుశెనగలను తినడం వల్ల అఫ్లాటాక్సిన్ ల పరిమాణం పెరిగి కాలేయానికి నష్టం కలిగిస్తుంది. అఫ్లాటాక్సిన్ లు అన్నది ఒక హానికరమైన పదార్థం. అయితే వేరుశెనగలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లోపం ఉంటుంది.అంతేకాదు దాని వినియోగం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వేరుశనగలను ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వాటిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అది గుండెపోటు జీర్ణ సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు ధమనులు మూసివేయడం లాంటి సమస్యలకు దారితీస్తుంది.
Related News
Chilled Water Side Effects: చల్లటి నీరు ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసా..?
వేసవిలో చాలా మంది చల్లటి పదార్థాలు తినడానికి, త్రాగడానికి ఇష్టపడతారు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లను ఇష్టపడే వారి సంఖ్య తక్కువేమీ కాదు.