HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health And Beauty Benefits Of Eating Cucumber

Cucumber: వేసవికాలంలో కీరదోసకాయ గొప్ప వరం.. ఆరోగ్యంతో పాటు అందం కూడా!

వేసవి కాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరం మరింత నీరసించిపోతుంది. ఇలా నీరసించిన శరీరానికి కీరదోసకాయ మంచి ఔషధంలా ఉపయోగపడుతుందట.

  • Author : Anshu Date : 12-02-2025 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cucumber
Cucumber

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కీర దోసకాయలు మనకు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇతర సీజన్లలో లభించినప్పటికీ వేసవికాలంలో వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కీర దోసకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ కీర దోసకాయ వేసవికాలంలో ఇంకా ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. మరి వేసవి కాలంలో కీరదోసకాయతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కీరదోసకాయను సలాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుందట. అలాగే శరీర వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. కీరదోసకాయలో విటమిన్ సి, కె లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయట. కీరదోసకాయలో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే వ్యర్థాలను బయటకు పంపి పొట్ట, ప్రేగులను శుభ్రపరుస్తుందట. అలాగే మలబద్దకం సమస్యలు కూడా దూరం అవుతాయట. దీంతో ఉదర సంబంధిత సమస్యలు తగ్గి ఉదర ఆరోగ్యం మెరుగుపడుతుందట. కాబట్టి కీర దోసకాయను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. తరచూ కీరదోసకాయను తీసుకుంటే రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయట.

అలాగే గుండె సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గించడానికి కూడ సహాయ పడుతుందట. కనుక బరువు తగ్గాలనుకునే వారు కీరదోసకాయను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ ను అదుపులో ఉంచుతుందట. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కీరదోసకాయను తినడం మంచిదని చెబుతున్నారు. ఇందులోని ఔషద గుణాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయట. కళ్ల సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయని చెబుతున్నారు. కీరదోసకాయ ముక్కలను కళ్లమీద పెట్టుకుంటే కంటికి చలువ కలుగుతుంది. అలాగే కళ్లు ఎర్రబడటం, దురద, మంట వంటి కంటి సమస్యలు తగ్గుతాయట. కీరదోసకాయను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. కీరదోసకాయను తింటే చర్మం మృదువుగా మారుతుందని చెబుతున్నారు. దోసకాయ గుజ్జును ముఖానికి అప్లై చేసుకుని కొద్ది సమయం తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే చర్మానికి మంచి నిగారింపును అందుతుందట. అలాగే చర్మ కణాలలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను తొలగించి చర్మ కణాలను శుభ్రపరుస్తుందట. అలాగే చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుందని చెబుతున్నారు. అందుకే వేసవికాలంలో కీర దోసకాయను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cucumber
  • Cucumber Benefits
  • health tips
  • summer

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd