Cucumber: వామ్మో వేసవికాలంలో కీరదోసకాయ తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలు కలుగుతాయా?
వేసవికాలంలో కీర దోసకాయ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:56 AM, Wed - 19 February 25

వేసవికాలంలో తీసుకోవలసిన పండ్లలో కీరదోసకాయ కూడా ఒకటి. కీర దోసకాయను కొంతమంది వెజిటేబుల్ గా భావిస్తే మరికొందరు పండ్ల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ కీరదోసకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల వేసవిలో వచ్చే చాలా రకాల సమస్యలను అధిగమించవచ్చు. వేసవికాలంలో కీర దోసకాయను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చట. అలాగే శరీర వీడిని తగ్గించి శరీరానికి చల్లదనం కూడా అందిస్తుందని చెబుతున్నారు. కీరదోసకాయలో విటమిన్ సి, కె లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది.
ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయట. కీరదోసకాయలో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే వ్యర్థాలను బయటకు పంపి పొట్ట, ప్రేగులను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. మలబద్ధకం సమస్యలు కూడా దూరం అవుతాయట. వేసవికాలంలో తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. తరచూ కీరదోసకాయను తీసుకుంటే రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయట. అలాగే గుండె సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గించడానికి సహాయపడుతుందట.
కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కీరదోసకాయను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కీరదోసకాయ యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి పలు రకాల క్యాన్సర్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. కీరదోసకాయ ముక్కలను కళ్లమీద పెట్టుకుంటే కంటికి చలువ చేస్తుందట అలాగే కళ్లు ఎర్రబడటం, దురద, మంట వంటి కంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. కీరదోసకాయను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. కీరదోసకాయను తింటే చర్మం మృదువుగా మారుతుందని చెబుతున్నారు. దోసకాయ గుజ్జును ముఖానికి అప్లై చేసుకుని కొద్ది సమయం తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే చర్మానికి మంచి నిగారింపును అందుతుందట. చర్మ కణాలలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను తొలగించి చర్మ కణాలను శుభ్రపరుస్తుందని అలాగే చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుందని అందుకే తప్పకుండా వేసవికాలంలో దోసకాయను తీసుకోవాలని చెబుతున్నారు.