Apple-Guava: జామపండ్లు, ఆపిల్స్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?
జామ పండ్లు యాపిల్స్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది. ఈ రెండింటి వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:03 AM, Thu - 26 December 24

ఆపిల్, జామపండు.. ఈవి రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. కేవలం రుచి విషయంలో మాత్రమే కాకుండా కలిగే ప్రయోజనాల విషయంలో కూడా ఇవి ఒకదానికి ఒకటి పోటీ అని చెప్పాలి. అయితే మరి జాంపండు యాపిల్ పండు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. జామపండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక జామ తింటే బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
యాపిల్స్ లో జామ పండుకి విరుద్ధంగా 14 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్‌లో 4 గ్రాముల డైటరీ ఫైబర్ ముఖ్యంగా పెక్టిన్ ఉంటుంది. జామలో ఆపిల్‌తో పోలిస్తే ఫైబర్ కాస్తా తక్కువగా ఉంటుంది. ఒక జామపండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. అయినప్పటికీ జామలో కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ అందిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. జామపండ్లలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో పాటు ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. దీని వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ముఖ్యంగా పింక్ జామపండులో ఎక్కువగా లైకోపీన్ కంటెంట్ ఉంటుంది. ఇది ప్రొస్టేట్, బ్రెస్ట్ హెల్త్‌కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ విషయంలో ఆపిల్స్ కూడా ఏమాత్రం తగ్గవు.ఈ రెండు పండ్లలో కేలరీలు తక్కువగానే ఉంటాయి. కానీ, కాస్తా తేడా ఉంటుంది. మీడియం సైజ్ ఆపిల్‌లో 95 కేలరీలు ఉంటాయి. జామలో 68 కేలరీలు ఉంటాయి. ఈ రెండు పండ్లు కూడా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అయితే, జామపండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాగా ఈవి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.