Green Dosa : గ్రీన్ దోస.. తింటే ఈ రోగాలు తగ్గుతాయ్
ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అందులో తగినన్ని నీరు పోసి 5 గంటలపాటు నానబెట్టాలి.
- By News Desk Published Date - 08:54 PM, Wed - 11 October 23

Green Dosa Recipe : సాధారణంగా మనం బ్రేక్ ఫాస్ట్ లో రకరకాల టిఫిన్లు తింటూ ఉంటాం. ఇడ్లీ, వడ, దోసె, ఉప్మా, పూరీ, చపాతీలతో పాటు ఓట్స్, బ్రెడ్ ఆమ్లెట్ వంటి వాటిని కూడా బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటాం. అయితే దోసెల్లో చాలా రకాలున్నాయి. మినపట్టు, పెసరట్టు, రవ్వట్టు, ఉల్లి దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె, రాగి దోసె.. ఇలా చాలా రకాల దోసెలున్నాయి. వాటిలో గ్రీన్ దోసె కూడా ఒకరకం. దీనిని తయారు చేసుకోవడం చాలా ఈజీ. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి ఆ గ్రీన్ దోసె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
గ్రీన్ దోసె తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
మినపప్పు – ఒక కప్పు
మెంతులు – ఒక టీ స్పూన్
కొత్తిమీర – ఒక కప్పు
పుదీనా – ఒక కప్పు
కరివేపాకు – అర కప్పు
జీలకర్ర – అర టీ స్పూన్
వాము – చిటికెడు
తరిగిన ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 4
ఉప్పు – తగినంత
గ్రీన్ దోసె తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అందులో తగినన్ని నీరు పోసి 5 గంటలపాటు నానబెట్టాలి. అనంతరం వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి నలిగిన తర్వాత.. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఉప్పు, వాము వేసి కలుపుకుని.. పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి.. దానిపై ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని దోసెలా వేసుకోవాలి. తర్వాత నూనె వేసి కాల్చుకోవాలి. ఈ దోశను రెండువైపులా ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే గ్రీన్ దోసె రెడీ. ఇందులో మెంతులు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి గ్రీన్ వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్నవారు ఈ దోసె తరచుగా తింటే.. షుగర్ కంట్రోల్ అవుతుంది. రాత్రిపూట చపాతీ తినలేని వారు ఈ దోస తిన్నా బరువు తగ్గుతారు.
Also Read : Rat Milk – 18 Lakhs : లీటరు ఎలుక పాలు రూ.18 లక్షలు.. ఎందుకు ?