HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Green Chillies Surprising Health Benefits For Weight Loss

Green Chillies: వామ్మో.. పచ్చిమిర్చిని పచ్చిగా తింటే ఏకంగా అన్ని రకాల లాభాలు కలుగుతాయా?

పచ్చిమిర్చి కారంగా ఉన్నప్పటికీ ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని దీనిని క్రమం తప్పకుండా తినాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 22-01-2025 - 1:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Chillies
Green Chillies

పచ్చిమిర్చి అనగానే వామ్మో కారం అని అంటుంటారు. కొందరు పచ్చిమిర్చి ని పచ్చిగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు కూరల్లో వేసిన పచ్చిమిరపకాయలను కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉంటాయి. ఇవి కారంగా ఉన్నప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా పచ్చిమిర్చిని పచ్చిగా తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చట. మరి పచ్చిమిర్చిని పచ్చిగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయట. అలాగే స్కిన్​ కి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయని, వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు పాడుకాకుండా హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. అలాగే పచ్చిమిర్చి మెటబాలిజంను పెంచుతుందట. జీర్ణ క్రియ కూడా ఫాస్ట్ గా జరుగుతుందట. దాంతో తిన్నది జీర్ణమయ్యి బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన పద్ధతిలో ఫ్యాట్​ని తగ్గిస్తుందట. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమిర్చిని తమ డైట్​లో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. అలాగే పచ్చిమిర్చి నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుందట. పచ్చిమిర్చి లోని క్యాప్సైసిన్ మెదడుకు నొప్పిని తీసుకువెల్లే సంకేతాలను నిరోధించి నొప్పిని త్వరగా తగ్గేలా చేస్తుందట.

అదేవిధంగా పచ్చిమిర్చి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయట. సహజంగానే గట్ సమస్యలు దూరమవుతాయట. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్​ ను శరీరం నుంచి బయటకు పంపడంలో పచ్చిమిర్చి ముఖ్యపాత్ర పోషిస్తాయట. ఇవి గుండె సమస్యలను తగ్గించి గుండెకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు డైట్ లో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల ముక్కుదిబ్బడ వంటి సమస్యలను తొలగించుకోవచ్చట. పచ్చిమిర్చి ముక్కు రంధ్రాలు మూసుకోకుండా చేసి గాలి బాగా ఆడేలా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits of green chilli
  • Chilli benefits
  • eating green chillies.
  • Green Chillies
  • green chillies benefits
  • health benefits
  • health tips

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

    • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

    • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

    • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

    • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd