Calcium Rich Tea : కాల్షియం ఎక్కువగా ఉండే టీ.. ఎలా తయారుచేసుకోవాలంటే..
ఒత్తిడి తగ్గాలి.. అలాగే ఆరోగ్యానికి మంచి జరగాలంటే ఈ క్యాల్షియం రిచ్ టీ ట్రై చేయండి. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి టీ.
- By News Desk Published Date - 06:30 AM, Tue - 14 November 23

Calcium Rich Tea : టీ.. నూటికి 90 శాతం మంది టీ లేదా కాఫీ ప్రతినిత్యం తాగుతుంటారు. వాటివల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అయితే వీటిని అధికంగా తీసుకోవడం అంతమంచిది కాదన్న విషయం తెలిసిందే. ఒత్తిడి తగ్గాలి.. అలాగే ఆరోగ్యానికి మంచి జరగాలంటే ఈ క్యాల్షియం రిచ్ టీ ట్రై చేయండి. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి టీ. మరి ఈ క్యాల్షియం రిచ్ టీ ఎలా చేసుకోవాలో చూద్దామా.
క్యాల్షియం రిచ్ టీ కి కావలసిన పదార్థాలు
ఎండిన క్రిసాంతిమమ్(చామంతి) పువ్వులు- 5-6
నీరు – 200 ఎంఎల్
తేనె – 1 స్పూన్
నిమ్మరసం – 1 కాయ
క్యాల్షియం రిచ్ టీ తయారీ విధానం
200 ఎంఎల్ నీటిని ఒక గిన్నెలో పోసి.. ఎండిన క్రిసాంతిమమ్(chrysanthemum) పువ్వులను నీటిలో వేయాలి. స్టవ్ పై పెట్టి ఈ నీటిని మరిగించాలి. తర్వాత నీరు వడగట్టి.. అందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఈ టీ తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటంతో పాటు.. పౌష్టికాహార లోపం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ లో వాడిన పూలలో ప్రత్యేకంగా క్యుబాంబరిన్ ఎ అనే రసాయన సమ్మేళనం ఎముకలు గుల్లబారకుండా కాపాడటంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయం తొలగించిన స్త్రీలు, మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు ఈ టీ తాగితే క్యాల్షియం పెరిగి ఎముకల సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆతృత, ఆందోళన వంటి సమస్యలు సైతం తగ్గుతాయి.