Gobi Manchurian: గోబీ మంచూరియా ఆరోగ్యానికి మంచిదా, కాదా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
చాలామంది ఇష్టంగా తినే గోబీ మంచూరియా ఆరోగ్యానికి మంచిది కాదా, దీనిని తినవచ్చా తినకూడదా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 21-03-2025 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
బయట ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ లో పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే వాటిలో గోబీ మంచూరియా కూడా ఒకటి. ఈ గోబీ మంచూరియాని ఎక్కువ శాతం మంది ఇష్టపడుతూ ఉంటారు. కొందరు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కొనుగోలు చేసి తింటే మరి కొందరు ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటారు. బయట ఉప్పు కారాలు ఎక్కువగా వాడుతూ ఉంటారని హైజీనిక్ గా ఉండదు అని తినవద్దని చెబుతూ ఉంటారు. అయితే నిజానికి ఈ గోబీ మంచూరియా తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే రోడ్డు సైడ్ కనిపించే ఈ గోబీ మంచూరియా ఆరోగ్యానికి కలిగించే నష్టం పెద్దగా ఏమీ లేదట. కాకపోతే అది కలర్ ఫుల్ గా కనిపించడం కోసం అందులో ఉపయోగించే ఫుడ్ కలర్ వల్లే అసలు సమస్య మొదలవుతుందని చెబుతున్నారు. ఈ ఫుడ్ కలర్ ని అధికంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న గోబీ మంచూరియాని భయం లేకుండా తినవచ్చు అని చెబుతున్నారు.
అయితే బయట దొరికే గోబీ మంచూరియా కూడా ఎప్పుడో ఒకసారి తింటే ఏమీ కాదని కానీ కొంతమంది గోబీ మంచూరియా, కబాబ్ వంటివి తరచుగా తింటూ ఉంటారని వీటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గోబీ మంచూరియా, చికెన్ కబాబ్, ఫిష్ కబాబ్ వంటివి ఆకర్షణీయంగా కనిపించడం కోసం రెడ్ కలర్ ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అంతర్ల మంచిది కాదని ఆ రెడ్ ఫుడ్ కలర్ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.