Garlic Water: ప్రతిరోజు వెల్లుల్లి నీరు తాగితే చాలు.. గుండెపోటు డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్!
ప్రతీ రోజు వెల్లుల్లి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగతాయట. అలాగే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:03 AM, Tue - 21 January 25

వంటింట్లో దొరికే ఘాటైన పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లి ఘాటుగా,కారంగా ఉంటుంది. ఇది కూరకు రు రుచిని పెంచడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. వెల్లుల్లిని ఉపయోగించి చాలా రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు వెల్లుల్లిని నేరుగా తింటే మరికొందరు కూరల రూపంలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. మరి వెల్లుల్లి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. వెల్లుల్లిల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీబ్లాక్ పరాసిటిక్ కాకుండా విటమిన్ బి6, సి, ఫైబర్, మాంగనీస్ వంటి మూలకాలు వెల్లుల్లిలో ఉంటాయట.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి పాయలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందట. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందట. ఇకపోతే వెల్లుల్లి నీరు ఎల్‌డిఎల్‌ని తగ్గిస్తుందట. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ ను తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే గుండెపోటును నివారిస్తుందట. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందట. వెల్లుల్లి నీరు తాగడం వల్ల శరీరంలో థ్రాంబోఎంబోలిజం నిరోధిస్తుందట. దీనివల్ల శరీరంలో రక్తం గడ్డ కట్టడం ప్రారంభమవుతుందట. వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుందట. జీర్ణక్రియ వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా స్థాయి మెయింటైన్ చేస్తుందట. ఏది తిన్నా అది బాగా జీర్ణమవుతుందని చెబుతున్నారు.
అలాగే ఇది విరేచనాలు, కడుపు తిమ్మిరి, నొప్పి, వాపు వంటి కడుపు సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుందట. గార్లిక్ వాటర్ అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందట. వెల్లుల్లిలో ఉండే మూలకాలు సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమలడం లేదా గార్లిక్ వాటర్ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి నీరు మాక్రోఫేజెస్ మరియు లింఫోసైట్‌లను పెంచుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందట. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఉండే గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయట. దీని కారణంగా శరీరం వ్యాధులు బ్యాక్టీరియాతో పోరాడటమే కాకుండా శరీరంలో హానికరమైన కాలుష్య ప్రభావాలను కూడా తగ్గిస్తుందట. తెల్లవారు జామున వెల్లుల్లిపాయలను తినడం వల్ల జలుబు, దగ్గు దూరమవుతాయట. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట.