MIdnight Food: అర్ధరాత్రి ఎందుకు ఆకలేస్తుంది? అలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ప్రతిరోజు మనం మూడు పూటలా భోజనం చేస్తూ ఉంటాం. మరి కొంతమంది తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తింటూ
- By Anshu Published Date - 08:45 AM, Thu - 1 September 22

ప్రతిరోజు మనం మూడు పూటలా భోజనం చేస్తూ ఉంటాం. మరి కొంతమంది తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తింటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎంత తిన్నా కూడా అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా ఆకలి వేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు. మరి అర్ధరాత్రి సమయంలో ఎందుకు ఆకలి వేస్తుంది? అటువంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు ఒకవేళ మన ఇంట్లో పాప్ కార్న్ ఉంటే దానిని తినవచ్చు.
వీటి ద్వారా శరీరంలోకి కెలోరీలు, కార్బోహైరేటు తక్కువగా చేరుతాయి. తామర గింజలు..వీటినే పూల్ మకాన్ అని పిలుస్తారు. ఇవి తక్కువ కెలోరీలు ఉన్న స్నాక్ ఐటమ్ అని చెప్పవచ్చు. ఇందులో కొవ్వు ఉండదు అలాగే కెలోరీలు కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఓట్స్ లో కూడా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అర్ధరాత్రి సమయంలో అయినా తినవచ్చు. అలాగే ఓట్స్ లో పాలు అరటిపండును కూడా కలిపి తీసుకోవచ్చు.
బియ్యంతో చేసే మరమరాల్లో తక్కువ కెలోరీలతో పాటు కొవ్వులు ఉండవు. ఈ మరమరాల్లో ఉల్లిగడ్డలు, పల్లీలు, పుట్నాలు మిక్స్ చేసి అర్ధరాత్రి సమయంలో అయినా తినవచ్చు. అలాగే వేయించిన పల్లీలు కూడా ఆకలిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే మంచి పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు చాక్లెట్ కలిపిన పాలను తాగవచ్చు. ఇక జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలతో పీనట్ బటర్ రాసి తీసుకోవచ్చు.