Weight Loss: ఈజీగా, వేగంగా బరువు తగ్గాలా.. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే!
వేగంగా బరువు తగ్గాలి అనుకున్న వారు డైట్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలని డైట్ ను ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:02 PM, Mon - 20 January 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. కొంతమంది సొంతంగా వారి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది అధిక బరువును తగ్గించుకోవడం రకరకాల మెడిసిన్స్ ను ఉపయోగించడంతో పాటు డైట్లు ఫాలో అవ్వడం ఎక్ససైజ్ చేయడం జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా సహజమైన పద్ధతిలో సహజమైన జ్యూస్ లను చేసుకొనివేగంగా బరువు తగ్గవచ్చట. సహజమైన పద్ధతిని పాటించి నెలకి ఐదు నుంచి ఆరు కేజీల వరకు బరువును సులువుగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
60 రోజులపాటు ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్ ని పాటించడం ద్వారా శరీరం లోపల గుండెపై, లివర్ పై పేరుకున్న కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చట. ఈ 60 రోజుల డైట్ ప్లాన్ లో రోజుకి ఒకసారి భోజనం రెండుసార్లు జూస్ లను తాగాలి. ఉదయం లేవగానే పళ్లు తోముకోకుండానే లీటరున్నర నీళ్లను తాగాలి. తరువాత 1 గంటలోపు మీకు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో మీకు తోచిన మంచి వ్యాయామాలను, యోగాసనాలను చేసుకోవాలి. ఆఫీస్ కు ఏమీ తినకుండానే అలాగే వెళ్లిపోవాలి. పదకొండు గంటలకు మళ్లీ రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లను తాగాలి. ఇలా మధ్యాహ్నం వరకు మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల ఫ్యాట్ లాస్ త్వరగా జరిగిపోతుంది. మధ్యాహ్నం వరకు ఇలా చేయడం వల్ల శరీరంలో వున్న కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. 12 గంటలకు ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే కూరగాయల జ్యూస్ కానీ తాగాలి. ఈ ఫ్రూట్ జ్యూస్ లో కొంత ఎండు ఖర్జూర పొడిని, తేనెను కూడా వేసుకోవచ్చట.
మధ్యాహ్నం 1 నంచి 2 గంటల లోపు రెండు పుల్కాలను ఆకుకూరతో తినాలి. మిల్ మేకర్, రాజుమా గింజలతో కూరను చేసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయట. పుల్కాతో కూరను ఎక్కువగా కలుపుకొని తినాలి. దీనివల్ల ప్రొటీన్లు, వైటమిన్లు పుష్కలంగా అందుతాయ్. భోజనం చేసిన 2 గంటల తరువాత మధ్య మధ్యలో ఒక్కో గ్లాసును సాయంత్రం 6 గంటల వరకు తాగుతూనే వుండాలి. సాయంత్రం 7 గంటలకు ఒక గ్లాసు బత్తాయి జ్యూస్ ను తీసుకోవాలి. ఇక దీంతో ఆ రోజు ఆహారం తీసుకోవడం పూర్తయినట్టే. పడుకునే వరకు ఇక ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అవసరమైతే కొన్ని సార్లు నీళ్లను తాగవచ్చు. ఇలా 60 రోజులు చేయడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుందట. ఒకవైపు కొవ్వు కరుగుతూనే మరోవైపు శరీరానికి అవసరమైన పోషకాలను, ప్రొటీన్లు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పైన వున్న ఈ డైట్ పాటిస్తే నెలలో 6 కేజీల వరకు బరువు తగ్గుతారట. కొవ్వు తగ్గడం, పోషకాలు అందడం మాత్రమే కాదు రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ డైట్ ను పాటించడం వల్ల నీరసం అస్సలు రాదట. ఎందుకంటే ఎప్పటికప్పుడు జ్యూస్ లను పౌష్టికాహారన్ని కూడా అందిస్తున్నాం కాబట్టి. ఇక నీళ్లు తాగడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. కేవలం 60 రోజుల పాటు బయటి ఆహారాన్ని, జంక్ ఫుడ్‌ను తినకుండా వుండాలి. నాలుకను అదుపులో పెట్టుకుంటే బరువు తగ్గి మంచి శరీర ఆకృతి మీ సొంతం అవుతుందని చెబుతున్నారు.