Beauty Tips: మగవారు మీ పొట్ట కనిపించకుండా దాచాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!
మగవారు పొట్ట కనిపించకుండా ఉండడం కోసం కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:20 PM, Fri - 27 September 24

మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత మగవారు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యలలో ఒకటి బట్టతల రెండవది పొట్ట. బట్టతల సంగతి పక్కన పెడితే పొట్ట కనిపించకూడదని ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో 20 ఏళ్లలోపు పిల్లల నుండే ఈ పొట్ట సమస్య మొదలవుతోంది. మగవారు ఎంత అందంగా ఉన్నప్పటికీ పొట్ట ముందుకు ఉంది అంటే చాలు అది వారి అందాన్ని పాడు చేస్తుందని చెప్పవచ్చు. ఇక అబ్బాయిలు బాధ పొట్ట తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి చిట్కాలు పాటిస్తే బాన పొట్ట తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పురుషులకు నడుము కొలత 40 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువగా ఉంటే అది బాన పొట్ట కిందకే వస్తుంది. సరియైన జాగ్రత్తలు తీసుకుంటే బానపట్టనే కరిగించడం పెద్ద సమస్య కాదని చెబుతున్నారు. ఇక ఇలా బాన పొట్ట కనిపించకూడదు అనుకుంటే కొంచెం వదులుగా లూస్ గా ఉండే బట్టలు ధరిస్తే కొంత వరకు పొట్టను కవర్ చేయవచ్చు. అలాగే ఒక మంచి జాకెట్ ధరించటం వలన ఎత్తైన మీ పొట్ట కనిపించకుండా ఉంటుంది. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటే ఎదుటి వాళ్ళ దృష్టి మీ పొట్ట మీద కాకుండా మీ స్టైల్ మీద పడుతుంది కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్ బాగుండేలాగా చూసుకోవాలి.
మీకు పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త మంచి బట్టల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్టల యొక్క కరెక్ట్ కాంబినేషన్ మన శరీరంలో ఉండే లోపాలని చాలా మటుకు కప్పి పుచ్చుతాయి. అలాగే మీరు వేసుకునే బట్టలు ముదురు రంగులో ఉంటే స్లిమ్ గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే మీరు ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆహారం తీసుకున్నప్పటికీ కొవ్వును పెంచే ఫుడ్డు కాకుండా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించే ఫుడ్లు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ స్వీట్ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.