Urinary Incontinence : మూత్రం లీక్.. కారణాలేమిటి ? కంట్రోల్ ఎలా ?
Urinary Incontinence : ప్రస్తుతం మహిళల్లో సర్వసాధారణంగా మారుతున్న ఆరోగ్య సమస్య ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ (యూఐ).
- Author : Pasha
Date : 31-12-2023 - 9:26 IST
Published By : Hashtagu Telugu Desk
Urinary Incontinence : ప్రస్తుతం మహిళల్లో సర్వసాధారణంగా మారుతున్న ఆరోగ్య సమస్య ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ (యూఐ). దీని బారినపడిన వారు మూత్రం ఆపుకొనలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ వ్యాధి పురుషులకు కూడా వస్తుంది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి యూరిన్ లీకేజీ సమస్యలు వస్తున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఎందుకీ ప్రాబ్లమ్ ?
30 నుంచి 35 ఏండ్ల తర్వాత మహిళల్లో ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ సమస్య(Urinary Incontinence) ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా కటి కండరాలు బలహీనపడుతున్నాయి. రుతువిరతికి ముందు లేదా కొన్నిసార్లు వయస్సు పెరగడం వల్ల మహిళల పొత్తికడుపు దిగువ కండరాలు అంటే కటి కండరాలు వీక్ అవుతాయి. దీనివల్ల మూత్రం లీక్ సమస్య ప్రారంభమవుతుంది. కొంతమంది మహిళల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, సరైన ఆహారం లేకపోవడం వల్ల మూత్రం లీక్ ప్రాబ్లమ్ వస్తుంది. కటి కండరాలు బలహీనంగా ఉండటం వల్ల నవ్వేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఏదైనా శ్రమ చేసేటప్పుడు మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. ప్రసవం తర్వాత కూడా కొందరు మహిళల్లో ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ సమస్య వస్తుంటుంది. దీనికి కారణం బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కింది కండరాలు ఎక్కువగా సాగదీయబడతాయి. ఇది వారిపై ఒత్తిడిని కలిగిస్తుంది. బలహీనపరుస్తుంది. ఊబకాయం, మధుమేహం కూడా మహిళల్లో యూరిన్ లీకేజీకి కారణమవుతాయి.
Also Read: APPSC Notification : 240 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈ పదార్థాలతో డేంజర్
కొన్ని డ్రింక్స్, ఫుడ్స్, మెడికేషన్స్ కూడా మూత్ర విసర్జనను ఎక్కువ చేసే మందులా పనిచేస్తాయి. ఇవి బ్లాడర్‌ను స్టిమ్యులేట్ చేస్తాయి. యూరిన్ వాల్యూంను పెంచుతాయి. ఆల్కహాల్, కెఫైన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, స్పార్కిల్డ్ వాటర్, ఆర్టిఫీషియల్ స్వీటనర్స్, చాకొలేట్, చిల్లి పెప్పర్స్, కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్, షుగర్ లేదా యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్, హార్ట్ మరియు బ్లడ్ ప్రెజర్ మెడికేషన్స్, సెడేటివ్స్ మరియు మజిల్ రిలాక్సన్ట్స్, విటమిన్ సీను ఎక్కువగా తీసుకోవడం వంటివి టెంపరరీ యూరినరీ ఇంకాంటినెన్స్ కు దారితీస్తాయి.