APPSC Notification : 240 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
APPSC Notification : ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- By Pasha Published Date - 08:58 AM, Sun - 31 December 23

APPSC Notification : ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అత్యధికంగా కామర్స్ సబ్జెక్టులో 35 పోస్టులు, కంప్యూటర్ సైన్స్‌లో 31 పోస్టులు, కెమిస్ట్రీలో 26 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 26 పోస్టులు ఉన్నాయి. పొలిటికల్ సైన్స్‌లో 21 పోస్టులు, బోటనీ, హిస్టరీ, జువాలజీలలో చెరో 19 పోస్టులు, మ్యాథమెటిక్స్‌లో 17 పోస్టులు, ఎకనామిక్స్‌లో 16 పోస్టులు, ఫిజిక్స్‌లో 11 పోస్టులను(APPSC Notification) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.త్వరలోనే విద్యార్హత, వయసు తదితర వివరాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. తగిన అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
వయోపరిమితి
18 నుంచి 42 ఏళ్లలోపు వారు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
Also Read: Ayodhya Aarti : అయోధ్య రామయ్య హారతి పాస్‌ల బుకింగ్ ఇలా..
రాతపరీక్ష విధానం
- మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
- రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.
- మొదటి పేపరులో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు- 150 మార్కులు
- పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు – 150 ప్రశ్నలు- 300 మార్కులు
- రెండు పేపర్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్
- మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లపై ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష టైం 60 నిమిషాలు.
- కనీస అర్హత మార్కులు ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30.