Curry Leaves: కరివేపాకే కదా అని పక్కన పెట్టేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
మామూలుగా మనంభోజనం చేసేటప్పుడు కూరలో వచ్చిన కరివేపాకుని కొంతమంది తింటే మరికొందరు తీసి పక్కన పెట్టిస్తూ ఉంటారు. అలా చేయకూడదు కరివేపాకు తప్పకుండా తినాలి అని వైద్యులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా కరేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కరివేపాకు
- By Anshu Published Date - 05:04 PM, Tue - 9 July 24

మామూలుగా మనంభోజనం చేసేటప్పుడు కూరలో వచ్చిన కరివేపాకుని కొంతమంది తింటే మరికొందరు తీసి పక్కన పెట్టిస్తూ ఉంటారు. అలా చేయకూడదు కరివేపాకు తప్పకుండా తినాలి అని వైద్యులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా కరేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కరివేపాకు కూరకు రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కరివేపాకులో పోషక విలువలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గించడంలోను ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడంలో ఉపయోగపడతాయి. అలాగే కరివేపాకు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చేస్తాయట. ఇందులోని ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయట.
ముదిరిన కరివేపాకును క్రమం తప్పకుండా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తినటం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలకు కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి మలినాలు దూరంఅవుతాయి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విషపూరిత అంశాలను తొలగిస్తుంది. ఇది చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకును ఎట్టి పరిస్థితులలో తినకుండా పారేయకండి.
note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి..