Beer: ప్రతిరోజు బీరు తాగుతున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలిసినప్పటికీ ప్రజలు మాత్రం
- By Anshu Published Date - 05:44 PM, Tue - 25 June 24

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలిసినప్పటికీ ప్రజలు మాత్రం మద్యాన్ని సేవిస్తూనే ఉంటారు. కొందరు సందర్భానుసారం బట్టి ఎప్పుడో ఒకసారి మందు తాగే వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రం ప్రతిరోజు బీర్లు మందులు తాగుతూనే ఉంటారు. ఇలా తరచుగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా తరచుగా మద్యం సేవించడం బీరు తాగడం వంటివి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
అయితే బీరు తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా అలాగే ప్రతిరోజు తాగితే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే మితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు బీరు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తుంది. బీరు తాగడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అయితే ప్రతిరోజు తీసుకోకుండా వారానికి ఒకసారో లేదంటే రెండుసార్లో తీసుకోవాలి. రోజూ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ డైటింగ్ చేస్తుంటారు. అయితే వీరు బీరు తీసుకుంటే ఆ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ప్రతిరోజు బీరు తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది.
చాలామంది బీరు తీసుకోవడం వల్ల నిద్ర పడుతుందని భావిస్తారు. కానీ అది రివర్స్ లో జరుగుతుంది. నిద్రలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతూ ఉంటుంది. ఇలా నిద్ర తక్కువ అయితే క్రమంగా అది అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. మెదడు సరిగా పనిచేయదు. పనితీరు మందగిస్తుంది. పేగులకు నష్టం వాటిల్లుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వారానికి ఒక్కసారి మాత్రమే తాగాలని చెబుతున్నారు. బీరు తీసుకోవడమనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని 31 శాతం తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు మద్యపానం చేసేవారు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం నుంచి ఉత్పన్నమయ్యే అతి పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి. మితమైన మద్యపానం తర్వాత జీవితంలో టైప్-2 మధుమేహ అభివృద్ధిని నిరోధించవచ్చు.